Cucumber Lassi: కీరదోస లస్సీ.. రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ఒక్కసారి ట్రై చేయండి..

కీరదోసతో చాలా రకాల డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఒక చిన్న కీరదోస ముక్క తిన్నా స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. ఎక్కువగా చాలా మంది కీర దోసతో చేసే లస్సీ తాగుతూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. వింటర్ సీజన్‌లో తాగడం వల్ల చర్మం పగల కుండా, తేమగా కాంతివంతంగా మారుతుంది..

Cucumber Lassi: కీరదోస లస్సీ.. రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ఒక్కసారి ట్రై చేయండి..
Cucumber Lassi

Updated on: Jan 23, 2025 | 10:51 AM

కీర దోస ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. ఎండ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కీరదోసతో చాలా రకాల డ్రింక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రతిరోజూ ఒక చిన్న కీరదోస ముక్క తిన్నా స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. ఎక్కువగా చాలా మంది కీర దోసతో చేసే లస్సీ తాగుతూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. వింటర్ సీజన్‌లో తాగడం వల్ల చర్మం పగల కుండా, తేమగా కాంతివంతంగా మారుతుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. మరి ఈ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

కీరదోస లస్సీకి కావాల్సిన పదార్థాలు:

కీరదోస, పెరుగు, అల్లం, కొత్తిమీర, పచ్చి మిర్చి, కొద్దిగా చక్కెర లేదా బెల్లం పొడి, ఇంగువ, నల్ల ఉప్పు, మిరియాల పొడి.

ఇవి కూడా చదవండి

కీరదోస లస్సీ తయారీ విధానం:

కీర దోసని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం, కొత్తిమీర, పచ్చి మిర్చిని కూడా కట్ చేయాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే పెరుగు, కొద్దిగా నల్ల ఉప్పు, ఇంగువ, మిరియాల పొడి, చక్కెర వేయాలి. కావాలి అనుకున్న వాళ్లు ఐస్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా అయ్యేలా అంతా మిక్సీ పట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కీరదోస లస్సీ సిద్ధం. చలి కాలంలో ఐస్ క్యూబ్స్ వేయకుండా లస్సీ తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.