Cashew Halwa: దీపావళికి స్పెషల్ స్వీట్ చేయాలంటే ఇది బెస్ట్..

దీపావళి పండుగ వచ్చిందంటే స్వీట్స్ తయారు చేసుకుని తింటూ.. బంధువుల్ని పలకరిస్తూ ఉంటారు. ఎక్కువ మంది స్వీట్ షాపుల్లో కొని తీసుకొస్తూ ఉంటారు. బయట షాపుల్లో కొనే వాటి కంటే మీరు ఇంట్లో తయారు చేసినవి గిఫ్ట్‌గా ఇస్తే.. వాళ్ల సంతోషమే వేరు. మీ కోసమే ఇక్కడ మరో కొత్త స్వీట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే కాజు హల్వా. ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ తయారు చేయడానికి..

Cashew Halwa: దీపావళికి స్పెషల్ స్వీట్ చేయాలంటే ఇది బెస్ట్..
Cashew Halwa
Follow us

|

Updated on: Oct 25, 2024 | 6:44 PM

దీపావళి పండుగ వచ్చిందంటే స్వీట్స్ తయారు చేసుకుని తింటూ.. బంధువుల్ని పలకరిస్తూ ఉంటారు. ఎక్కువ మంది స్వీట్ షాపుల్లో కొని తీసుకొస్తూ ఉంటారు. బయట షాపుల్లో కొనే వాటి కంటే మీరు ఇంట్లో తయారు చేసినవి గిఫ్ట్‌గా ఇస్తే.. వాళ్ల సంతోషమే వేరు. మీ కోసమే ఇక్కడ మరో కొత్త స్వీట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే కాజు హల్వా. ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ తయారు చేయడానికి కూడా తక్కువ సమయమే పడుతుంది. మరి ఈ కాజు హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు హల్వాకి కావాల్సిన పదార్థాలు:

జీడిపప్పు, పంచదార లేదా బెల్లం పొడి, గోధుమ పిండి, కుంకుమ పువ్వు, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్.

ఇవి కూడా చదవండి

కాజు హల్వా తయారీ విధానం:

ముందుగా జీడిపప్పును మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నీళ్లు వేసి మరిగించండి. ఇప్పుడు పంచదరా లేదా బెల్లం పొడి వేసి పెద్ద మంట మీద నీటిలో కరిగిస్తే చాలు. ఈ సమయంలో యాలకుల పొడి, కుంకుమ పువ్వు రేకులు వేసి కలిపి.. పక్కన పెట్టండి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో కొద్దిగా గోధుమ పిండి, జీడి పప్పు పొడి వేసి వేయించాలి. మాడిపోకుండా వేయించాలి. ఇప్పుడు ఇందులోనే పంచదార లేదా బెల్లం పొడి మిశ్రమం కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గర పడే కొద్దీ మిక్స్ చేస్తూనే ఉండాలి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కాజు హల్వా సిద్ధం.