Beetroot Cutlet: ఆరోగ్యంగా స్నాక్స్ తినాలంటే.. ఈ బీట్ రూట్ కట్‌లెట్స్ బెస్ట్!

| Edited By: Ravi Kiran

Jul 23, 2024 | 9:45 PM

చాలా మందికి ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. వీలైనంత వరకు హెల్దీగా, ఫిట్‌గా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్లకు హెల్దీ స్నాక్‌గా బీట్ రూట్ కట్ లెట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవి కేవలం హెల్దీ మాత్రమే కాదు.. రుచిగా కూడా ఉంటాయి. ఎప్పుడూ బీట్‌రూట్‌తో కర్రీ లేదా ఫ్రై తిని విసుగు చెందితే ఈ సారి ఇలా కట్‌ లెట్స్‌ని ట్రై చేయండి. ఇవి చేయడం కూడా చాలా సులభమే. తక్కువ సమయమే పడుతుంది. బీట్ రూట్ తినని వారు సైతం ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలకు..

Beetroot Cutlet: ఆరోగ్యంగా స్నాక్స్ తినాలంటే.. ఈ బీట్ రూట్ కట్‌లెట్స్ బెస్ట్!
Beetroot Cutlet
Follow us on

చాలా మందికి ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. వీలైనంత వరకు హెల్దీగా, ఫిట్‌గా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్లకు హెల్దీ స్నాక్‌గా బీట్ రూట్ కట్ లెట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవి కేవలం హెల్దీ మాత్రమే కాదు.. రుచిగా కూడా ఉంటాయి. ఎప్పుడూ బీట్‌రూట్‌తో కర్రీ లేదా ఫ్రై తిని విసుగు చెందితే ఈ సారి ఇలా కట్‌ లెట్స్‌ని ట్రై చేయండి. ఇవి చేయడం కూడా చాలా సులభమే. తక్కువ సమయమే పడుతుంది. బీట్ రూట్ తినని వారు సైతం ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలకు ఆరోగ్యంగా ఏదైనా రుచి కరంగా పెట్టాలి అనుకుంటే.. ఈ స్నాక్‌ని ట్రై చేయండి. గెస్టులకు కూడా ఈ స్నాక్ పెట్టొచ్చు. మరి ఈ బీట్ రూట్ కట్ లెట్స్‌ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బీట్ రూట్ కట్ లెట్‌కి కావాల్సిన పదార్థాలు:

బీట్ రూట్, బంగాళ దుంప, ఉల్లి పాయ, పచ్చి మిర్చి, పచ్చి బఠానీలు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, బ్రెడ్ పౌడర్, మైదా, కొత్తి మీర, ఆయిల్.

బీట్ రూట్ కట్ లెట్‌ తయారీ విధానం:

బీట్ రూట్ కట్ లెట్ తయారు చేయాలంటే ముందు.. బంగాళ దుంప ముక్కల్ని, బీట్ రూట్‌ ముక్కల్ని కుక్కర్‌లో వేసి రెండు, మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు కుక్కర్ వేడి తగ్గాక.. వీటిని తీసుకుని బంగాళ దుంప, బీట్ రూట్ ముక్కల్ని తీసి చల్లార నివ్వాలి. అలాగే పచ్చి బఠానీలను కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళ దుంప, బీట్ రూట్ ముక్కల్ని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదిపిన మిశ్రమాన్ని ఓ లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి పాయలు, కొత్తి మీర, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్‌లో కట్ లెట్స్‌లా చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి దానిపై ఓ నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. పాన్ వేడెక్కగానే.. కట్ లెట్స్‌ని తీసుకుని బ్రెడ్ క్రంబ్స్‌లో రెండు వైపులా తిప్పి.. పాన్‌లో వేయాలి. వీటిని మీడియం మంటపై షాలో ఫ్రై చేసుకోవాలి. అలా రెండు వైపులాగా బాగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్ రూట్ కట్ లెట్స్ రెడీ. వీటిని సాస్ లేదా మయనీస్‌తో తిన్నా రుచిగానే ఉంటాయి.