Allam Pachadi: క్యాటరింగ్ స్టైల్‌లో అల్లం పచ్చడి.. ఫాస్ట్‌గా.. రుచిగా..

అల్లం పచ్చడి, పెసరట్టు మంచి కాంబినేషన్. తెలుగోళ్లకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్. అల్లం పచ్చడి కేవలం పేసరట్టులోకే కాదు.. ఇతర అన్ని టిఫిన్స్‌లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా అల్లం పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. అల్లం పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. నిజానికి అల్లం పచ్చడిని సరైన పద్దతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్‌లో చేసే అల్లం పచ్చడి అంటే..

Allam Pachadi: క్యాటరింగ్ స్టైల్‌లో అల్లం పచ్చడి.. ఫాస్ట్‌గా.. రుచిగా..
Allam Pachadi

Edited By: Ram Naramaneni

Updated on: Jun 02, 2024 | 8:18 PM

అల్లం పచ్చడి, పెసరట్టు మంచి కాంబినేషన్. తెలుగోళ్లకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్. అల్లం పచ్చడి కేవలం పేసరట్టులోకే కాదు.. ఇతర అన్ని టిఫిన్స్‌లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా అల్లం పచ్చడి తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. అల్లం పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. నిజానికి అల్లం పచ్చడిని సరైన పద్దతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్‌లో చేసే అల్లం పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. మరి వాళ్లు ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాటరింగ్ స్టైల్ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

అల్లం, చింతపండు, పచ్చి శనగ పప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఉప్పు, బెల్లం తురుము, ఆయిల్, వెల్లుల్లి, కరివేపాకులు, ఆయిల్.

క్యాటరింగ్ స్టైల్ అల్లం పచ్చడి తయారీ విధానం:

ముందుగా అల్లాన్ని శుభ్రం చేసి పైన పొట్ట తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక పక్కకు తీసి.. అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోనే ఎండు మిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. నెక్ట్స్ నానబెట్టిన చింత పండును నీటితో సహా వేసి ఉడికించాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వేయాలి. చిన్న ఫ్లేమ్‌లో వీటన్నింటనీ మూత పెట్టి ఉడికించాలి. ఈ ఇగురు దగ్గర పడ్డాక.. స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇది బాగా చల్లారిన తర్వాత.. మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్టులా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బెల్లం తురుము కూడా వేసి మిక్సీ పట్టాలి. ఒక వేళ నీళ్లు అవసరం అయితే.. వేడి నీళ్లు తప్ప.. చన్నీళ్లను వాడకూడదు. చన్నీళ్లు వాడితే.. పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలా పచ్చడి తీసి.. ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ పచ్చడికి పోపు తాళింపు పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి సిద్ధం. ఈ స్టైల్‌లో కొంచెం ప్రాసెస్‌గా ఉంటుంది. కానీ రుచి మాత్రం చాలా బావుంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి తయారు చేయండి.