AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీకు ఓక్రా వాటర్‌ గురించి తెలుసా.? దాని లాభాలేంటంటే..

మీరు ఎప్పుడైనా ఓక్రా వాటర్‌ గురించి విన్నారా.? ఇటీవల ఈ పదం ఎక్కువగా ట్రెండ్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతోంది. ఓక్రా వాటర్‌తో కలిగే ప్రయోజనాలు అలాంటివి మరి. ఇంతకీ ఓక్రా వాటర్‌ అంటే ఏంటి.? ఈ వాటర్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: మీకు ఓక్రా వాటర్‌ గురించి తెలుసా.? దాని లాభాలేంటంటే..
Okra Water
Narender Vaitla
|

Updated on: Jun 02, 2024 | 6:12 PM

Share

మీరు ఎప్పుడైనా ఓక్రా వాటర్‌ గురించి విన్నారా.? ఇటీవల ఈ పదం ఎక్కువగా ట్రెండ్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతోంది. ఓక్రా వాటర్‌తో కలిగే ప్రయోజనాలు అలాంటివి మరి. ఇంతకీ ఓక్రా వాటర్‌ అంటే ఏంటి.? ఈ వాటర్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓక్రా వాటర్‌ అంటే మరెంటో కాదు.. బెండకాయలను నానబెట్టిన నీరు. ఇందుకోసం ముందుగా బెండకాయలను అడ్డంగా ముక్కలు చేసి నీటిలో నానబెట్టాలి. ఇక 8 నుంచి 12 గంటల వరకు నీటిలో నానబెట్టిన తర్వాత నీటిని తాగాలి. రాత్రంతా నానబెట్టి ఉదయం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఓక్రా వాటర్‌లో రుచి కోసం కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇంతకీ ఓక్రా వాటర్‌తో లాభాలు ఏంటంటే..

* ఓక్రా వాటర్‌లో విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-కేలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

* ఓక్రా వాటర్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల పేగుల కదలికలను మెరుగు చేస్తుంది. అరుగుదల సమస్యలు రాకుండా, మలబద్ధకం దరిచేరకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

* ఈ నీటిని క్రమంతప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇన్సులిన్‌ అదుపులో ఉండని వారు, డయాబెటిస్‌తో బాధపడే వారు ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

* గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఓక్రా వాటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్-సీ, యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడిని నుంచి రక్షించడమే కాక.. హానికరమైన టాక్సిన్ల ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని మరింత అందంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.

* శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలను తొలగించడంలో బెండకాయ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా ఓక్రా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..