Aloo Sandwich: బేకరీలో లభించే ఆలూ శాండ్ విచ్ ను ఇలా చేయండి.. అస్సలు విడిచి పెట్టరు!!

| Edited By: Ram Naramaneni

Sep 30, 2023 | 6:45 PM

ఆలూ శాండ్ విచ్ అందరూ రుచి చూసే ఉంటారు. బేకరీల్లో, రోడ్ సైడ్ హోటల్స్, స్మాల్ రెస్టారెంట్లలో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని ఎక్కువగా తింటూంటారు. ఆలూ శాండ్ విచ్ ని మనం కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. కానీ ఇలా బేకరీ స్టైల్లో శాండ్ విచ్ ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి.. పిల్లలు, పెద్దలు అస్సలు విడిచి పెట్టరు. మళ్లీ మళ్లీ చేయమని అడుగుతూ ఉంటారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్స్ లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్ గా ఎలా అయినా తినవచ్చు. సమయం కూడా ఎక్కువగా పట్టదు. మరి బేకరీ స్టైల్లో ఆలూ సాండ్ విచ్ ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి..

Aloo Sandwich: బేకరీలో లభించే ఆలూ శాండ్ విచ్ ను ఇలా చేయండి.. అస్సలు విడిచి పెట్టరు!!
Aloo Sandwich
Follow us on

ఆలూ శాండ్ విచ్ అందరూ రుచి చూసే ఉంటారు. బేకరీల్లో, రోడ్ సైడ్ హోటల్స్, స్మాల్ రెస్టారెంట్లలో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని ఎక్కువగా తింటూంటారు. ఆలూ శాండ్ విచ్ ని మనం కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. కానీ ఇలా బేకరీ స్టైల్లో శాండ్ విచ్ ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి.. పిల్లలు, పెద్దలు అస్సలు విడిచి పెట్టరు. మళ్లీ మళ్లీ చేయమని అడుగుతూ ఉంటారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్స్ లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్ గా ఎలా అయినా తినవచ్చు. సమయం కూడా ఎక్కువగా పట్టదు. మరి బేకరీ స్టైల్లో ఆలూ సాండ్ విచ్ ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి లుక్కేసేయండి.

ఆలూ శాండ్ విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

బంగాళా దుపంలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కారం, ఉప్పు, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మ రసం, శాండ్విచ్ బ్రెడ్, టమాటా కెచప్, మయనీస్, బటర్

ఇవి కూడా చదవండి

ఆలూ శాండ్ విచ్ తయారీ విధానం:

ముందుగా బంగాళా దుంపల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా ఉడికించుకుని పెట్టుకోవాలి. ఉడికించుకున్న ఆలూని మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కారం, ఉప్పు, పచ్చి మిర్చి, ఉల్లి పాయ ముక్కలు, జీల కర్ర పొడి, నిమ్మ రసం, గరం మసాలా, కొత్తి మీర, ఆఖరిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ నెక్ట్స్ శాండ్ విచ్ బ్రెడ్ తీసుకుని దానికి ఒక వైపు టమాటా కెచప్ రాసుకోవాలి. దీనిపై బంగాళ దుంప మిశ్రమాన్ని ఉంచి అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి.

తర్వాత మరో బ్రెడ్ ను తీసుకుని దానికి మయనీస్ రాసుకుని ఆలూ మిశ్రమంపైన ఉంచాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని వేడి చేసి, కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత శాండ్ విచ్ ని ఉంచి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ శాండ్ విచ్ సిద్ధం. దీన్ని టమాటా కెచప్ తో తిన్నా, మయనీస్ తో సర్వ్ చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. పిల్లలు అయితే మరింత ఇష్టంగా తింటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.