Ajwain Paratha: వాముతో టేస్టీ పరాఠా.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

పరాఠాల్లో ఇప్పటికే ఎన్నో వెరైటీలు తెలుసుకున్నాం. పరాఠాలు చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. స్టఫింగ్ సిద్ధం చేసుకుని ఆ తర్వాత పరాఠాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పరాఠా మాత్రం ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు..

Ajwain Paratha: వాముతో టేస్టీ పరాఠా.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
Ajwain Paratha 1

Edited By:

Updated on: Nov 17, 2024 | 9:26 PM

పరాఠాల్లో ఎన్నో రకాల వెరైటీలు ఉంటాయి. అనేక రకాల స్టఫింగ్స్‌తో పరాఠాలు చేస్తూ ఉంటారు. పరాఠాలు చాలా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేసినా రుచి చాలా బాగుంటాయి. పరాఠాల్లో ఇప్పటికే ఎన్నో వెరైటీలు తెలుసుకున్నాం. పరాఠాలు చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. స్టఫింగ్ సిద్ధం చేసుకుని ఆ తర్వాత పరాఠాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పరాఠా మాత్రం ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పరాఠాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తక్కువ సమయంలోనే రెడీ అవుతాయి. మరి ఈ వాము పరాఠాను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాము పరాఠాలకు కావాల్సిన పదార్థాలు:

వాము, ఉప్పు, నీరు, ఆయిల్, గోధుమ పిండి.

ఇవి కూడా చదవండి

వాము పరాఠాలు తయారీ విధానం:

ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండి, వాము, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పిండి మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత రుచిగా వస్తాయి పరాఠాలు. కాబట్టి పిండిని బాగా కలపండి. ఇలా కలిపిన పిండిని ఓ 20 నిమిషాల పాటు పిండి పైన తడి క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకని చపాతీ కర్రతో చక్కగా గుండ్రంగా పరాఠాలు చేయాలి. ఇక పాన్ వేడి చేసుకుని ఒక్కో పరాఠాను వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వాము పరాఠాలు సిద్ధం. ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆ తర్వాత అయినా రైతా, కర్రీలతో తిన్నా బాగుంటాయి. ఇదే వాము పరాఠాలను వేరే స్టైల్ కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని చపాతీల్లా చేసుకుని కూడా తినొచ్చు.