పన్నీర్ తో ఏ వంట చేసినా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి.. వెజ్ లో ఉండే మరో ఆప్షన్ పన్నీర్. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ ను తరచూ తీసుకుంటూ ఉంటే శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతూంటారు. ఇలాంటి వారు పన్నీర్ తినడం వల్ల దాని బారి నుంచి తప్పించుకోవచ్చు. షుగర్ ఉన్న వారు కూడా పన్నీర్ ను తినవచ్చు. దీంతో స్నాక్స్, కర్రీస్, రైస్ లు చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అందులో ఒకటి పన్నీర్ కీమా ఒకటి. పన్నీర్ తో వెరైటీగా ట్రై చేయాలనుకునే వారు ఇది చేసుకుని తినవచ్చు. మరి ఈ కర్రీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పన్నీరు కీమాకి కావాల్సిన పదార్థాలు:
పన్నీర్ తురుము, ఉల్లి పాయ, కారం,పసుపు, నిమ్మరసం, ఉప్పు, కొత్తి మీర తురుము, నూనె, నెయ్యి, పచ్చి మిర్చి, టమాటా, గరం మసాలా పొడి, మిరియాల పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి.
తయారీ విధానం:
స్టవ్ మీద ఒక కళాయి పెట్టి నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చు. నూనె వేడెక్కాక లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక.. ఉల్లి పాయల తరుగు కూడా వేసుకోవాలి. ఇది కూడా వేగా టమాటా తురుమును వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కూడా మగ్గాక.. ధనియాల పొడి, జీల కర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు గ్రేవీలా తయారవుతుంది. ఈ సమయంలో పన్నీర్ తురుమును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంతో కర్రీ పొడి పొడిగా తయారవుతుంది. నెక్ట్స్ కొంచెం కొత్తి మీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కీమా సిద్ధం. వేడి వేడి అన్నంలో ఈ కీమా వేసుకుని తింటే బలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి