ఆరోగ్యకరమైన ఆహారాల్లో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్ అంటే వెజిటేరియన్స్‌కే కాదు నాన్ వెజిటేరియన్స్‌కి చాలా ఇష్టం. పన్నీర్‌తో ఎన్నో రకాల స్టాటర్స్, కర్రీలు, రైస్ ఐటెమ్స్ తయారు చేసుకోవచ్చు. పన్నీర్‌తో ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. పుల్కా, చపాతీ, నాన్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది పన్నీర్. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పాలక్ పన్నీర్ అనేది బెస్ట్ కాంబో కర్రీగా చెబుతారు. పాలక్ పన్నీర్ కాంబినేషన్‌లో చేసే పులావ్ మరింత రుచిగా ఉంటుంది. అన్నీ సిద్ధంగా ఉండే కేవలం 10 నిమిషాల్లో ఈ రెసిపీ అయిపోతుంది. మరి ఈ పాలక్ పన్నీర్ పులావ్ ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.
పాలకూర, పన్నీర్, వండిన బాస్మతీ రైస్, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, నెయ్యి, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు, కసూరి మేథి.
ముందుగా పాలకూరను ఉప్పు వేసి కడిగి కట్ చేసి స్టవ్ మీద ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత పాలకూరను వడకట్టి మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి తరుగు, దంచిన అల్లం వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ పచ్చి మిర్చి, ఉల్లి తరుగు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కలర్ మారాక పన్నీర్ క్యూబ్స్ వేసి మొత్తం కలుపుకోవాలి.
ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఓ ఐదు నిమిషాలు పన్నీర్ ముక్కలు వేయించాక.. పాలకూర ప్యూరీని కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇది కూడా ఓ పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి. ఆ నెక్ట్స్ కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి వేసి మిక్స్ చేసి.. చిన్న మంట మీద ఐదు నిమిషాలు వేయించాక.. చివరగా ఉడికించిన అన్నం, కసూరి మేథి, కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసి మొత్తం అంతా మిక్స్ చేసి.. ఓ ఐదు నిమిషాలు అన్నం అంతా కలిసేలా మిక్స్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ పాలక్ పులావ్ సిద్ధం.