Beetroot Korma: హెల్దీతో పాటు రుచి కూడా కావాలా.. అయితే ఈ బీట్ రూట్ కూర్మాను ట్రై చేసి చూడండి!

| Edited By: Ravi Kiran

Nov 06, 2023 | 9:38 PM

బీట్ రూట్ ని కూడా మన ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటాం. బీట్ రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువును, డయాబెటీస్ ను కంట్రోల్ చేయడంలో, రక్త పోటును, రక్త హీనతను తగ్గించడంలో, గుండె సమస్యలు లేకుండా చూడటంలో బీట్ రూట్ లు మనకు బాగా హెల్ప్ అవుతాయి. బీట్ రూట్ ను కొంత మంది నేరుగా సలాడ్స్ లో యాడ్ చేసుకుని తింటారు. అలా పచ్చిది తినలేని వారు కూరలు చేసుకుని తింటారు. ఎక్కువ మంది బీట్ రూట్ తో కేవలం వేపుళ్లు మాత్రమే..

Beetroot Korma: హెల్దీతో పాటు రుచి కూడా కావాలా.. అయితే ఈ బీట్ రూట్ కూర్మాను ట్రై చేసి చూడండి!
Beetroot Kurma
Follow us on

బీట్ రూట్ ని కూడా మన ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటాం. బీట్ రూట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువును, డయాబెటీస్ ను కంట్రోల్ చేయడంలో, రక్త పోటును, రక్త హీనతను తగ్గించడంలో, గుండె సమస్యలు లేకుండా చూడటంలో బీట్ రూట్ లు మనకు బాగా హెల్ప్ అవుతాయి. బీట్ రూట్ ను కొంత మంది నేరుగా సలాడ్స్ లో యాడ్ చేసుకుని తింటారు. అలా పచ్చిది తినలేని వారు కూరలు చేసుకుని తింటారు. ఎక్కువ మంది బీట్ రూట్ తో కేవలం వేపుళ్లు మాత్రమే చేసుకుని తింటారు. కూరలు తక్కువగా చేసుకుని తింటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా బీట్ రూట్ తో కూర్మా చేసుకుని తింటే.. అస్సలు వదిలి పెట్టరు. బీట్ రూట్ తో కూర్మా చేసుకునే తింటారు. దీన్ని రోటీస్, చపాతీలు, అన్నం, వెజ్ బిర్యానీ రైస్ లోకి ఎలా తిన్నా చాలా బావుంటుంది. మరి ఈ బీట్ రూట్ కూర్మాను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్ కూర్మాకు కావాల్సిన పదార్థాలు:

బీట్ రూట్, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, పెరుగు, కరి వేపాకు, కొత్తి మీర, ఆవాలు, జీల కర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, నూనె.

ఇవి కూడా చదవండి

బీట్ రూట్ కూర్మా తయారీ విధానం:

ముందుగా బీట్ రూట్ ని తీసుకుని చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లో వేసుకుని ఓ రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని.. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత జీల కర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని చిట పటలాడేంత వరకూ వేయించుకోవాలి. నెక్ట్స్ ఉల్లి పాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లి పాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాసేపు వేయించుకున్నాక.. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలుపుకోవాలి.

మసాలాలన్నీ వేగిన తర్వాత ఉడికించిన బీట్ రూట్ ముక్కలను వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బీట్ రూట్ ముక్కలు ఉడికించిన నీటిని కూడా వేసుకుని దగ్గర పడేంత వరకూ ఉడికించుకోవాలి. కూర దగ్గర పడ్డాక అన్నీ సరిపోయాయో లేదో ఒక్కసారి రుచి చూసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ కొద్దిగా చల్లారాక.. పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బీట్ రూట్ కూర్మా సిద్ధం. దీన్ని వేటిల్లో అయినా తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.