Bhindi masala Fry: అమెరికా నుంచి ప్రపంచ దేశాల్లో అడుగు పెట్టిన బెండకాయ ఏడాది పొడవునా లభిస్తుంది. ఈ బెండకాయ అనేక ఆరోగ్యప్రయోజనాలకు కూడా ఇస్తుంది. దీనిలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్ ‘ సి ‘ దీనిలో చాలా ఎక్కువ. గాస్ట్రిక్ సమస్యలను, ఎసిడిటీకి చక్కని పరిష్కారము . దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ను తగ్గిస్తుంది. ఇక బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. అయితే బెండకాయ ను ఎక్కువగా ప్రై గానో.. పులుసు గానో తయారు చేసుకుంటారు.. ఈరోజు బెండకాయ మసాలా ఫ్రై తయారీ గురించి తెలుసుకుందాం..!
బెండకాయలు – 1/2 కేజీ
నూనె – వేయించడానికి కావాల్సినంత
పసుపు – అరచెంచా
శనగపప్పు – కప్పు
మినప్పప్పు – అరకప్పు
ధనియాలు – 4 టేబుల్‌స్పూన్లు
జీలకర్ర – 2చెంచా
ఎండుమిర్చి – 15
పల్లీలు – అరకప్పు
ఉప్పు – తగినంత
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టౌ ని వెలిగించి బాణలి పెట్టి.. కొంచెం వేడి ఎక్కిన తర్వాత నూనె వెయ్యాలి. నేను వేడి చేసిన తర్వాత అందులో పల్లీలు, శనగపప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి.
ఆరబెట్టుకున్న బెండకాల ముచ్చికలను కట్ చేసి.. వాటి మధ్యలో నిలువుగా చిన్న గాటు పెట్టాలి.. అందులో రెడీ చేసుకున్న మసాలా కారాన్ని నింపాలి. పొయ్యి మీద బాణలి పెట్టి.. నూనె కాగిన తర్వాత మసాలా నింపుకున్న బెండకాయలను జాగ్రత్తగా వేసి.. ఎర్రగా వచ్చే వరకూ వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చిన తర్వాత మిగిలిన మసాలా పొడిని ఆ బెండకాయలపై వేసి కొంచెం సేపటి తర్వాత స్టౌ మీద నుంచి దింపేస్తే సరిపోతుంది. కమ్మటి రుచికరమైన బెండకాయ మసాలా ఫ్రై రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి సాంబార్ తో పాటు తింటే చాలా బాగుంటుంది.
Also Read: