బ్రెడ్ పూరీ వినడానికే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ అయినా.. పూరీ అయినా విడిగా తింటారు. బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలు, స్నాక్స్ తయారు చేస్తూ ఉంటారు. బ్రెడ్ తో ఏ వంటకం చేసినా టేస్టీగా ఉంటాయి. బ్రెడ్ తో అవే కాకుండా పూరీలు కూడా తయారు చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. ఇవి ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్. అలాగే చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. మరి బ్రెడ్ తో రుచిగా ఉండే పూరీలను ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్, గోధుమ పిండి లేదా మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, పెరుగు, నూనె.
బ్రెడ్ స్లైసెస్ ను జార్ లో వేసి మెత్తగా పొడిలా తయారు చేసుకోవాలి. ఈ బ్రెడ్ పొడిన ఒక లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే గోధుమ పిండి లేదా మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, కొద్దిగా గోరు వెచ్చటి ఆయిల్, పెరుగు వేసి పిండిని ముందు కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా.. కొద్దిగా గట్టిగా ఉండేలా కలపండి. దీన్ని ఓ 20 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి.
ఈ లోపు పిండిని తీసుకుని మరోసారి కలిపి.. ఉండలుగా చేసుకుని.. పూరీల్లా వత్తు కోవాలి. ఆయిల్ వేడెక్కాక వీటిని ఒక్కొక్కటి వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చు కోవాలి. ఇలా రెడీ అయిన పూరీలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పూరీలు రెడీ అవుతాయి. వీటిని మసాలా కూరతో తింటే.. చాలా బావుంటాయి. ఒకదాని తర్వాత మరొకటి తింటూ ఉంటారు. వీకెండ్స్ లో లేదా ఏదైనా స్పెషల్ డేస్ లో వీటిని చేసుకుని తినవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒక సారి ట్రై చేయండి.