AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫుల్లుగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్.. చికెన్, మటన్ కన్నా 100 రేట్లు శక్తివంతమైన ఫుడ్ ఇదే..

ఉలవల్లో ప్రోటీన్‌, పీచు పదార్థాలు, ఐరన్‌, ఇతర ఖనిజాలు ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపు నిండిన భావన, జీర్ణక్రియ, బరువు నియంత్రణకు తోడ్పడవచ్చు. ఉలవలతో గుగ్గిళ్లు, ఉలవచారు వంటి వంటకాలు తయారు చేసుకోవచ్చు. అయితే ఇవి చికెన్‌, మటన్‌ కంటే 100 రెట్లు శక్తివంతమైనవని చెప్పడానికి ఆధారాలు లేవు. మధుమేహం లేదా రక్తహీనత ఉన్నవారు ఉలవలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు.

ఫుల్లుగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్.. చికెన్, మటన్ కన్నా 100 రేట్లు శక్తివంతమైన ఫుడ్ ఇదే..
Horse Gram Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2026 | 12:35 PM

Share

సాధారణంగా మనం ఎన్నో పోషకాలు, హై ప్రోటీన్ ఉన్న చికెన్, మటన్ పవర్‌ఫుల్ అనుకుంటాం.. కానీ.. అంతకు మించి అనేలా.. ఉలవలు (Horse Gram) చాలా శక్తివంతమైనవి, ఆరోగ్యకరమైనవి.. మాంసాహారం తినని వారికి లేదా బరువు తగ్గాలనుకునే వారికి ఉలవలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్‌లతో పోలిస్తే ఉలవలు ఎందుకు పవర్‌ఫుల్ అని అంటారో ఈ కథనంలో తెలుసుకుందాం.. వాస్తవానికి ఉలవులు.. మంచి పోషకాహారంతో నిండి ఉన్న ఒక అద్భుతమైన పప్పు ధాన్యం. మన సాంప్రదాయ ఆహారంలో ఇవి ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఉలవలు ప్రోటీన్, పీచు పదార్థాలు, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉండి, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియ సమస్యలను దూరం చేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, రక్తహీనతను తగ్గించడానికి ఇవి చాలా ప్రయోజనకరమైనవి. ముఖ్యంగా చలికాలంలో ఉలవలను ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణక్రియ మెరుగుదలకు:

ఉలవల్లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు రోజు ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పీచు పదార్థాలు శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసటను దూరం చేస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:

బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉలవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పచ్చి ఉలవల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే గుణాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ గుణాల కారణంగా మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు వాటిని డైట్ లో చేర్చుకోవచ్చు. అయితే, మోతాదులో తీసుకోవడం, అలాగే డైటీషియన్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.

రక్తహీనత నివారణ:

రక్తహీనత (ఎనీమియా) సమస్యలను తగ్గించడంలో ఉలవలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ఉలవలను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ:

ఉలవలు చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు, ఇతర కార్డియాక్ సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయం:

ఉలవల్లో అధికంగా ఉండే ప్రోటీన్, పీచు పదార్థాలు బరువు తగ్గడంలో గణనీయంగా సహాయపడతాయి. ఈ పోషకాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి, అతిగా తినాలనే కోరికను తగ్గిస్తాయి. గుగ్గిళ్లు, ఉలవచారు, లేదా స్నాక్స్ రూపంలో ఉలవలను ఆహారంలో చేర్చడం ద్వారా బరువును సులభంగా నియంత్రించవచ్చు. ఉలవలను కషాయం రూపంలో తాగితే బరువు తగ్గడంలో మరింత సహాయం అందుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చర్మం, జుట్టు సంరక్షణ:

చర్మ ఆరోగ్యానికి, జుట్టు పోషణకు కూడా ఉలవలు దోహదం చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువగా ఉండటంతో చర్మ సమస్యలను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు చర్మానికి అవసరమైన పోషణను అందించి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతోపాటు, రోజంతా శరీరం ఆక్టివ్‌గా, శక్తివంతంగా ఉండటానికి ఉలవలు తోడ్పడతాయి.

అందుకే.. మీ ఆహారంలో ఉలవలను భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us