RBI: ప్రతీ నెలా ఈఎంఐలు చెల్లిస్తున్నారా..? రెండ్రోజుల్లో ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. బీ రెడీ..
ఈఎంఐలు చెల్లించేవారికి ఆర్బీఐ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. వడ్డీ రేట్ల పెంపునకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న ఆర్బీఐ కీలక సమావేశం నిర్వహిస్తుండగా.. 7వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. 7వ తేదీన ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్ చేయనుందని తెలుస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైంది. ఈ సమావేశం ఈ నెల 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ మీటింగ్‌లో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని తెలుస్తోంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్బీఐ కూడా దానినే ఫాలో అవ్వనుందని సమాచారం. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఎల్‌నివో ప్రభావం, ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటి పరిణామాల ప్రకారం వడ్డీ రేట్ల పెంపుకు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆర్బీఐ కూడా పెంపు ఆలోచన చేస్తున్నట్లు వార్లలొస్తున్నాయి. ఇదే జరిగే లోన్లు తీసుకున్నవారికి నెలవారీ ఈఎంఐలు పెరగనున్నాయి. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారమని చెప్పవచ్చు.
6 శాతానికి పెంచే అవకాశం..?
2025లో విడతల వారీగా ఆర్బీఐ రెపో రేటును 125 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఈ ఏడాది వరుసగా నాలుగు పాలసీ సమావేశాల్లోనూ వడ్డీ రేట్లను యధాతధంగా ఉంచింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతం వద్ద స్ధిరంగా ఉంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులతో ముడి చమురు ధరల్లో నిలకడ లేకపోవడం, ఇంధన ధరలు పెరుగుతుండటం, దేశంలో ఎల్‌నివో పరిస్థితులతో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతుండటంతో వడ్డీ రేట్ల పెంపుకు ఆర్బీఐ మొగ్గు చూపుతోంది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 5.25 శాతంగా ఉండగా.. ఇది 5.50కి చేరుకోనుంది. 2027 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేట్లను విడతల వారీగా పెంచే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 5.75 నుంచి 6 శాతానికి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీుసుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
రెపో రేటు పెరిగితే ఏమవుతుంది..?
ఆర్బీఐ రెపో రేటు అనేది లోన్ వడ్డీ రేట్లకు అనుసంధానం చేసి ఉంటుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. అదే రెపో రేటు తగ్గిస్తే లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న వెంటనే బ్యాంకులు తమ వడ్డీ రేట్లను కచ్చితంగా తగ్గించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్ల పెరగడం వల్ల ఫ్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐలు పెరుగుతాయి. దీని వల్ల నెలవారీ ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. సామాన్యులకు ఇది భారంగా మారే అవకాశముంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాల్సిన ఎక్కవ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
