క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఇంటిళ్లపాది ఒకేచోట ఆహ్లాదంగా గడుపుతున్నారు. పైగా ఆదివారమే క్రిస్మస్ వచ్చింది. అంతా రెగ్యులర్ గా వండే వంటలు కాకుండా కొత్తగా తినాలనుకుంటారు. అయితే సండే కదా చికెన్ ఇంట్లో తప్పనిసరిగా వండే వంటకం. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ను ఇంటిళ్లపాదికి నచ్చేలా ప్లాన్ చేయాలనుకుంటున్నారా. అయితే చికెన్ టిక్కా రెసిపీ చేయండి. నిజమే వండే విధానంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇంత టేస్టీ రెసిపీ ఇంట్లో వాళ్లకు పెడితే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. సో టేస్టీ చికెన్ టిక్కా రెసిపీని ఇప్పుడు చూద్దాం.
1) మసాల దినుసులు, పెరుగు నూనెతో చికెన్‌ని బాగా కలపాలి. అనంతరం ఫ్రిజ్‌లో 3-4 గంటలు పెట్టి మేరినేట్ చేయాలి. అనంతరం చికెన్ ను ఓవెన్‌లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2) కడాయిలో నూనె వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేయాలి.
3) చిటపటలాడడం స్టార్ట్ అయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4) ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ కూడా వేసి వేయించాలి.
5) ఓవెన్ లో ఉడికించిన చికెన్ టిక్కా వేసి వేయించాలి.
6) ఉల్లిపాయ-టమోటో గ్రేవీ వేసి బాగా కలపాలి. సిద్ధం చేసిన మసాలా పొడులు వేసి బాగా కలపాలి.
7) కొంచెం నీటిని వేసి, మంటను సిమ్ లో పెట్టి తక్కువ వేడి మీద కలపాలి.
8) మొత్తం జ్యూసిగా అయ్యాక వెన్న, వంట క్రీమ్‌ను వేసి కలియతిప్పాలి.
9) అనంతరం గిన్నెలోకి తీసుకుని తాజా కొత్తిమీరతో అలంకరిస్తే..టేస్టీ..టేస్టీ చికెన్ టిక్కా రెడీ…
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..