Heart Attack: అకస్మాత్తుగా ఆగిపోతున్న గుండె.. అసలు కారణం ఇదేనట.. ఆ ఒక్కటి తగ్గిస్తే అంతా సేఫ్!!

|

Mar 11, 2023 | 11:30 AM

World Health Organisation: 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' ప్రకారం, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఉప్పు ఎక్కువగా తినడం వల్లనే వస్తున్నాయని షాకింగ్ వివరాలు ప్రకటించింది. తాజాగా ఉప్పుకు సంబంధించి 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' తొలిసారిగా ఓ నివేదికను ప్రచురించింది.

Heart Attack: అకస్మాత్తుగా ఆగిపోతున్న గుండె.. అసలు కారణం ఇదేనట.. ఆ ఒక్కటి తగ్గిస్తే అంతా సేఫ్!!
Heart Attack And Cardiac Arrest
Follow us on

‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఉప్పు ఎక్కువగా తినడం వల్లనే వస్తున్నాయని షాకింగ్ వివరాలు ప్రకటించింది. తాజాగా ఉప్పుకు సంబంధించి ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ తొలిసారిగా ఓ నివేదికను ప్రచురించింది. ఇందులో సోడియం ఎక్కువగా తింటే ఎలాంటి సమస్య వస్తుందో చెప్పుకొచ్చింది. అంటే ఉప్పు తింటే ఏ సమస్య వస్తుందో కూడా స్పష్టంగా పేర్కొంది. 2025 నాటికి 30 శాతం తక్కువ ఉప్పు తినాలనే ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రపంచవ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదికల్లో పేర్కొంది.

ఆహారంలో ఎక్కువ ఉప్పు వాడకంతో అనేక రోగాలు..

సోడియం శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. కానీ, దీనిని ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, అకాల మరణాలు సంభవించవచ్చని పేర్కొంది. టేబుల్ ఉప్పు (సోడియం క్లోరైడ్)లో ప్రధాన మూలకంగా ఉంటుంది. దీనితో పాటు, ఈ పోషకం సోడియం గ్లుటామేట్ లాంటి ఇతర సుగంధ ద్రవ్యాలలో కూడా కనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు..

WHO ప్రపంచ నివేదిక ప్రకారం ప్రజల ఆహారం నుంచి ఉప్పును తగ్గించే విధానాలను అమలు చేయడానికి 2030 వరకు పట్టవచ్చని అంచనా వేసింది. ఇలా చేయడం వల్ల ప్రపంచంలోని 70 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపింది. అయితే, కేవలం తొమ్మిది దేశాలు – బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే తక్కువగా ఉప్పు తినేలా ప్రజలకు అవగాహన కల్పించాయి. ఉప్పు తక్కువగా తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

రెండింతలు ఎక్కువగా తింటున్న ప్రజలు..

ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రజలు ఉప్పును రోజుకు 10.8 గ్రాములు తింటున్నారంట. అయితే, డబ్ల్యూహెచ్‌ఓ అంచనా మేరకు ప్రతిరోజూ 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అంటే ఒక చెంచా తీసుకోవాలని సూచించింది. ఈ లెక్కన ప్రజలు సగటున రెండింతలు ఎక్కువగా తింటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే మనం ప్రస్తుతం ఉప్పు వాడుతున్న విధానం ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ప్రకారం రెట్టింపు కంటే ఎక్కువగా ఉండడంతో.. ఆందోళన మొదలైంది.

WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలు, వ్యాధులకు అనారోగ్యకరమైన ఆహారం ప్రధాన కారణంగా ఉప్పును పేర్కొన్నారు. కాగా, ఆహారంలో ఎక్కువ సోడియం తినడం వల్ల మరణాల సంఖ్య పెరిగింది. గుండెపోటు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరగడంలో అధిక సోడియం ప్రధానమైనదిగా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రజలు తమ ఆహారంలో తక్కువ ఉప్పు తినడం, దానిని నియంత్రించాలనుకుంటే కొన్ని ప్రత్యేకమైన, కఠినమైన నియమాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.

సోడియం వాడకాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ చేసిన ప్రతిపాదనలు..

1. ఆహార పదార్థాల్లో తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను తీసుకోవాలి. తినే భోజనంలో సోడియం పరిమాణం ఎంత తీసుకోవాలో ముందే టార్గెట్‌గా పెట్టుకోవాలి.

2. స్కూల్స్, హాస్పిటల్స్, ఆఫీసులు వంటి ప్రభుత్వ సంస్థల పరిధిలో సోడియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించేందుకు తగిన విధానాలను రూపొందించుకోవాలి.

3. తక్కువ సోడియం ఉన్న ప్రొడక్ట్‌లను ఎంచుకోవడానికి లేబుల్స్ అతికించాలి.

4. ఉప్పు లేదా సోడియం ఉపయోగించడానికి మీడియాతోపాటు ఇతర మాధ్యమాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రతిపాదించింది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..