AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cashew Nuts: జీడిపప్పు ఎగబడి తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!

జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన హృదయాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కానీ, జీడిపప్పు అతిగా తిన్నా, లేదంటే, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

Cashew Nuts: జీడిపప్పు ఎగబడి తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
జీడిపప్పు: జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని పచ్చిగా లేదా తేలికగా వేయించి తినవచ్చు అలాగే పండ్ల సలాడ్‌లు, డెజర్ట్‌లు లేదా వివిధ రకాల వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు. జీడిపప్పులు మంచి శక్తికి మూలం, ఇవి ఎముకలు, మెదడు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజుకు 12 నుండి 15 జీడిపప్పులు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2025 | 8:48 PM

Share

డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందుకే ఇటీవలి కాలంలో ప్రజలు ఎక్కువగా బాదం, వాల్‌నట్‌, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ తినడం ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నారు. జీడిపప్పు పోషకాల భాండాగారం అని అందరికీ తెలిసిందే. దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, రాగి, థయామిన్, విటమిన్ బి6, విటమిన్ కె, పొటాషియం, ఇనుముతో సమృద్ధిగా ఉన్న జీడిపప్పు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అవసరం. వాటిలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన హృదయాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కానీ, జీడిపప్పు అతిగా తిన్నా, లేదంటే, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి డిటెల్స్‌ ఇక్కడ చూద్దాం..

జీడిపప్పు చాలా మంది ఇష్టపడతారు. ఇందులో మంచి మోనో- పాలిఅన్‌సాచ్ కొవ్వులు, ప్రోటీన్, విటమిన్లూ ఖనిజాలూ ఉంటాయి. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విట‌మిన్ B6 వంటి పోషకాలు శరీరానికి ఉపయోగపడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. కానీ జీడిపప్పులో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా రోజుకు 5–10 పీసులు సరిపోతాయి. వ్యాయామం ఎక్కువ చేసే వారు లేదా అథ్లెట్లు కోసం 15–30 పీసులు వరకూ అనుకూలం. రోజుకు 30–40 పీసులు లేదా అంతకంటే ఎక్కువ తినడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడం, జీర్ణ సంబంధ సమస్యలు, ఉబ్బరం రావచ్చు. కొందరికి అలర్జీ ఉంటే జీడిపప్పు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి.

ఖాళీ కడుపుతో జీడిపప్పు తినడం వల్ల కడుపులో మంట లేదా అజీర్తి వచ్చే అవకాశం ఉంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. అయితే, అలర్జీ సమస్యలు ఉన్నవారు జీడిపప్పును తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.. బరువు పెరగడానికి ప్రయత్నిస్తున్నవారు జీడిపప్పును అధికంగా తీసుకోకూడదు. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు జీడిపప్పును తీసుకోవాలంటే, ముందుగా వైద్యుని సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.