Women Lose Weight : డెలీవరీ తర్వాత మహిళలు ఈ 5 మార్గాల్లో సులువుగా బరువు తగ్గించుకోవచ్చు..!

|

Jul 01, 2021 | 2:20 PM

Women Lose Weight : మహిళలు తల్లి అయినప్పుడు ఆమె శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. డెలివరీ తర్వాత అధికంగా బరువు పెరుగుతారు.

Women Lose Weight : డెలీవరీ తర్వాత మహిళలు ఈ 5 మార్గాల్లో సులువుగా బరువు తగ్గించుకోవచ్చు..!
Women Lose Weight
Follow us on

Women Lose Weight : మహిళలు తల్లి అయినప్పుడు ఆమె శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. డెలివరీ తర్వాత అధికంగా బరువు పెరుగుతారు. అంతేకాదు తల్లి అయిన తరువాత పిల్లల బాధ్యత కూడా మహిళలపై పెరుగుతుంది. దీంతో ఆమె తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతుంది. వర్కవుట్స్ చేయలేరు. శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. అందుకే మహిళలు సులువుగా బరువు తగ్గించుకోవడానికి ఈ పద్దతులను పాటిస్తే సరిపోతుంది.

1. కొవ్వు కరిగించడానికి అజ్వైన్ నీరు చాలా సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు రోజంతా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో రెండు సార్లు తిన్న తరువాత మరోసారి తాగాలి. దీంతో బరువు తగ్గడంతో పాటు గ్యాస్ సమస్య కూడా ఉండదు.

2. గ్రీన్ టీ బరువు తగ్గడానికి సులభమైన మార్గంగా భావిస్తారు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ బరువును వేగంగా తగ్గిస్తుంది. అలాగే మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీలో చక్కెర కలపకూడదని గుర్తుంచుకోండి. మీకు అవసరం అనిపిస్తే తేనె కలిపితే బాగుంటుంది.

3. డెలివరీ సాధారణమైతే బాదం, ఎండుద్రాక్ష కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 10 ఎండుద్రాక్ష, 10 బాదంపప్పు గింజలు కలిపి పౌడర్‌గా చేసుకొని గోరువెచ్చని పాలతో కలిపి తాగాలి.

4. దాల్చిన చెక్క, లవంగాలు బెల్లీఫ్యాట్‌ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో 2 నుంచి 3 లవంగాలు వేసి దాల్చిన చెక్క ముక్క వేసి మరిగించాలి. ఆ నీటిని గోరువెచ్చగా తాగాలి. కావాలంటే రోజంతా నిల్వ చేసుకొని తాగవచ్చు.

5. నిద్రవేళలో ఒక కప్పు పాలు వేడి చేసి నాలుగు టీస్పూన్ల జాజికాయ పొడి కలిపి తాగాలి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు.

6. తేలికపాటి వ్యాయామాలు చేయండి..
ఈ చర్యలతో పాటు, కొంత శారీరక శ్రమ కూడా అవసరం. మీరు వ్యాయామం చేయలేకపోతే ఉదయం, సాయంత్రం కొంత సమయం ప్రాణాయామం చేయండి. ఇది కాకుండా ఉదయం,సాయంత్రం కనీసం అరగంట పాటు నడవండి. ఇది మీ బరువును తగ్గిస్తుంది. అలాగే హార్మోన్ల సమస్యల నుంచి కూడా ఉపశమనం ఉంటుంది.

Lakkamma Devi Temple: ఆ ఆలయంలోని అమ్మవారికి చెప్పుల దండలను సమర్పిస్తున్న భక్తులు… మాంసమే అక్కడ నైవేద్యం.. ఎక్కడుందంటే..

TTD News: టీటీడీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతాలు కట్

కేసుల నిర్ధారణలో సోషల్ మీడియా ట్రయల్స్ ప్రామాణికం కావు.. జడ్జీలకు సీజేఐ జస్టిస్ ఎన్ .వి. రమణ హితవు