Healthy Snacks: ఆధునిక జీవన శైలిలో బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పని మీద ధ్యాసతో ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ఆరోగ్య నిపుణులు పని మధ్యలో అప్పుడప్పుడు మంచి పోషకాలు ఉండే స్నాక్స్ తినాలని సూచిస్తున్నారు. అప్పుడే హుషారుగా ఉంటారు. అయితే సాయంత్రం పూట ఈ 4 ఆహారాలు స్నాక్స్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
1. కాల్చిన వేరుశెనగ
కాల్చిన వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వుకు మూలం వేరుశనగలు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం గుప్పెడు వేరుశెనగలను తీసుకొని కాల్చి తినండి. భలే ఉంటుంది.
2. డ్రై ఫ్రూట్స్
సాయంత్రం పూట డ్రై ప్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా పోషకాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. తక్షణ శక్తిని అందుతాయి. బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూర, పిస్తా పప్పు తీసుకోవాలి.
3. మొక్కజొన్న
మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు పెరగకుండా సహాయపడుతుంది. ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇది అందరికి అందుబాటులో ఉంటుంది. సాయంత్రం పూట చిరుతిండికి వైద్యులు మొక్కజొన్నను ఎక్కువగా సూచిస్తారు. వీటిని కాల్చి, ఉడకబెట్టి, మసాలాలు కలుపుకొని కూడా ఆస్వాదించవచ్చు.
4. శనగలు
మన దేశంలో ఎప్పట్నుంచో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ శనగలు. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మామూలు శనగలు, కాబూలీ శనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా తినడం వల్ల వారికి నాన్‌వెజిటేరియన్స్ పొందే అనేక లాభాలన్నీ పొందొచ్చు.