Health Tips: సీజనల్ పండ్లు, కూరగాయలతో ఆరోగ్యం పదిలం.. చలికాలంలో జస్ట్ ఈ టిప్స్ పాటించండి..

|

Nov 17, 2021 | 2:14 PM

Winter Season Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లోనే అంటు వ్యాధులు, పలు రకాల వైరస్‌ల బారిన పడే అవకాశముంది. కావున చలికాలం తీసుకునే ఆహారంపై ప్రత్యేక

Health Tips: సీజనల్ పండ్లు, కూరగాయలతో ఆరోగ్యం పదిలం.. చలికాలంలో జస్ట్ ఈ టిప్స్ పాటించండి..
Winter Season Health Tips
Follow us on

Winter Season Health Tips: శీతాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లోనే అంటు వ్యాధులు, పలు రకాల వైరస్‌ల బారిన పడే అవకాశముంది. కావున చలికాలం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో వచ్చే పండ్లు, కూరగాయలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. క్యారెట్, యాపిల్స్, ఆరెంజ్, కివీస్ వంటి రకరకాల పండ్లు, కూరగాయలను రోజూ తినే ఆహారంలో చేర్చుకోవాలి. అయితే.. సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటి ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పేర్కొంటున్నారు. సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయలను ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాహార లోపం సమస్య తొలగిపోతుంది..
శరీర అవసరాలు రుతువులను బట్టి మారుతూ ఉంటాయి. చల్లటి వాతావరణం మిమ్మల్ని జలుబు, ఫ్లూ, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. పలు రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. శీతాకాలపు ఆహారంలో కివీ, యాపిల్, సిట్రస్ పండ్లు వంటి విటమిన్ సి అధికంగా లభ్యమయ్యే పండ్లను చేర్చుకోవాలి.

పోషకాలు అనేకం..
ఈ సమయంలో తాజా మార్కెట్‌లో సీజనల్ పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. పోషక విలువలు, తాజాదనాన్ని కలిగించి ఉత్సాహంగా ఉంచేందుకు ఇవి సహాయపడతాయి. కావున ఈ సీజన్‌లో వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు, పండ్లను మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది. వింటర్ సీజన్లో ముఖ్యంగా ఆహారం త్వరగా జీర్ణం కావడం మంచిది.

ఆకుకూరలు..
బచ్చలికూర, పాలకూర లాంటి ఆకుకూరలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. మీ కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా చలికాలంలో పాలకూరను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

ఆరెంజ్, అల్లం, క్యారెట్ రసం
నారింజలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. అల్లం అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి నివారణకు ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

దానిమ్మ, దుంప రసం
దానిమ్మ, దుంపలతో చేసిన డిటాక్స్ డ్రింక్ ప్రతిరోజూ తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కావున ఈ సీజన్‌లో దానిమ్మ, దుంపల రసాన్ని ఆహారంలో చేర్చుకోవాలి.

Also Read:

Weird News: నాలుగేళ్లుగా మూత్రం తాగుతున్న మహిళ.. దాని రుచి అలా ఉందంటూ.. షాకింగ్ విషయాలు

Viral Video: తగ్గెదేలే.. ఫిట్నెస్‌పై దృష్టిపెట్టిన శునకం.. కసరత్తులు చూసి షాకవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్