చిన్న పని చేసినా నీరసపడిపోతున్నారా? వయస్సు రీత్యా శారీరక శ్రమ చేయలేకపోతున్నామని మదన పడుతున్నారా? మామూలుగా వయస్సు పెరగే కొద్ది కొన్ని పనులు చేయలేము అని నిర్ధారణకు వస్తాం. అవి చేయకుండా జాగ్రత్త పడుతుంటాం.. ముఖ్యంగా పురుషులు ఇలాంటి విషయాల్లో సిగ్గు పడుతుంటారు. ఎందుకంటే తోటివారు ఇతర పనులు చేసినా మనం చేయలేకపోతున్నామంటూ ఇబ్బంది పడుతుంటారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం కొన్ని ఆహారాలు తరచూ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా స్త్రీ, పురుషుల శరీరాల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుందని, అందువల్ల పురుషులు ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. వైద్యులు సూచిస్తున్న ప్రోటీన్ ఫుడ్ పై ఓ లుక్కెద్దాం.
బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ -ఈ అధికంగా ఉంటాయి. బాదం గుండెకు, జీర్ణవ్యవస్థకు, చర్మ ఆరోగ్యానికి మంచిది. అందుకే పురుషులు తమ రెగ్యులర్ డైట్ బాదం పప్పును తప్పనిసరిగా వినియోగించాలి.
ఈ నూనెెలో మోనోశాట్యురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి నొప్పి, వాపును తగ్గిస్తాయి. అందువల్ల డైలీ ఆలివ్ నూనెతో చేసిన వంటకాలను తింటే మంచిది.
మామూలుగా గ్రీన్ టీ చాలా మంది బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు. నలభై దాటిన పురుషులు రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతి రోజూ తమ ఆహారంలో ఓ గుడ్డును తింటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు అధికంగా ఉండడంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. కనీసం వారానికి మూడు గుడ్లు అయినా తీసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే పాలల్లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి రోజూ పాలును తాగాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..