Health Tips: మనలో చాలా మందికి ఉద్యోగ, వైవాహిక బాధ్యతల నడుమ కుటుంబంతో గడిపే సమయం కూడా దొరకడంలేదు. ఈ నేపథ్యంలోనే మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా కొందరిలో శృంగార సామర్థ్యం, లైంగిక కోరికలు క్షీనిస్తున్నాయని అధ్యయనాలు, నివేదికలు చెబుతున్నాయి. ఇలా కోరికలు నశించడం వల్ల పిల్లలు పుట్టకపోవడమే కాక.. చివరికి విడాకులకు దారి తీసే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారపు అలవాట్లను అలవరచుకుంటే లైంగిక శక్తి రెట్టిస్తుందని నిపుణులు చెబుతుతున్నారు. ఈ విషయంపై పోషకాహార నిపుణులు కూడా.. మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా లైంగిక సామర్థ్యం పెరుగుదలకు ఉపయోగపడతాయని వివరించారు. ఈ మేరకు కొన్ని రకాల ఆహార పదార్థాలు డైట్‌లో భాగంగా తీసుకోవాలని.. తద్వారా లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వారు చెబుతున్నారు. మరి శృంగార సామర్థ్యం కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
అవకాడో: కామోద్దీపన పండుగా ప్రసిద్ధి చెందిన అవోకాడో పురుషులలో శృంగార సామర్థ్యం పంచేందుకు వరంలా పనిచేస్తుంది. చూడడానికి గుడ్డు ఆకారంలో ఉండే ఈ పండులో లైంగిక శక్తిని పెంచగల బీటా కెరోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మీలో లైంగిక కోరికలను కలగజేసి శృంగార సామర్య్థం పెరిగేలా చేస్తాయి.
దానిమ్మ: దానిమ్మలోని పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పక తీసుకోవలసిన సూపర్ ఫ్రూట్. ఇది ఆరోగ్యానికే కాక లైంగిక శక్తిని పెంచే లక్షణాలను కూడా కలిగి ఉంది. కాబట్టి శృంగార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావించేవారు తప్పకుండా దానిమ్మను తినాలంట.
స్ట్రాబెర్రీలు: లైంగిక సామర్థ్యం పెంచే ఆహారాల్లో స్ట్రాబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీనస్ దేవతకు చిహ్నంగా సూచించే ఈ పండ్లలో సంతానోత్పత్తిని మెరుగుపరిచే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంతో ఉపయోగకరంగా ఉంటాయి.
అత్తిపండ్లు: అంగస్తంభన లక్షణాలను నిరోధించేందుకు అత్తి పండ్లను దివ్యౌషధంగా పేర్కొంటారు ఆయుర్వేదికులు. పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యం, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో అంజీర్ ఉపయోగకరంగా ఉంటుందని అనేక అధ్యయనాల్లోనూ రుజువైంది.
బీన్స్, తృణధాన్యాలు: సంతానోత్పత్తిని పెంచడంలో బీన్స్, తృణధాన్యాలు కూడా ఉపకరిస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..