Walnuts Benefits: వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో మీకు తెలుసా..? ఆ 3 రోగాలు ఫసక్..!

రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. వాల్‌నట్‌లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో వాల్‌నట్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. వాల్‌నట్ చర్మాన్ని మెరిపిస్తుంది, ముడతలు తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపున 2 వాల్‌నట్లు నానబెట్టినవి తీసుకోవాలి.

Walnuts Benefits: వాల్‌నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో మీకు తెలుసా..? ఆ 3 రోగాలు ఫసక్..!
Walnuts

Updated on: Jul 11, 2025 | 8:53 PM

వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యం అంటున్నారు. ఇందులో ఉండే విటమిన్‌ లు డయాబెటిస్‌, బరువు తగ్గించడం, ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ వాల్‌నట్స్‌ తినటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. వాల్‌నట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. వాల్‌నట్‌లలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి. రోజు రెండు వాల్‌నట్స్‌ తినటం వల్ల దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వాల్‌నట్‌లు ఫైబర్, ప్రోటీన్‌లకు గొప్ప మూలం, ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. వాల్‌నట్‌లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో వాల్‌నట్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. వాల్‌నట్ చర్మాన్ని మెరిపిస్తుంది, ముడతలు తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపున 2 వాల్‌నట్లు నానబెట్టినవి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..