గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయన్న విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు బయటపెట్టాయి. తాజాగా ఇందులో ఉండే పదార్ధాలు కొవిడ్-19, మధుమేహం, వయసు పైబడిన వారి అనారోగ్య సమస్యలను సైతం నివారిస్తాయని తెలిసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐఐఎస్ఈఆర్ భోపాల్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. మాలిక్యులర్ అండ్ సెల్యూలార్ బయోకెమిస్ట్రీ జర్నల్‌లో ఆర్టికల్‌ను ప్రచురించారు. ఇందులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు.
కొవిడ్-19, ఏజింగ్, మధుమేహానికి.. బయోమాలిక్యులర్ రిలేషన్స్ మధ్య బంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రీన్ టీ, కొకొ, బెర్రీస్‌లో ఉండే కెటచిన్స్.. యాపిల్స్, గ్రేప్స్‌లో ఉండే ప్రొసీనిడిన్స్, బ్లాక్ టీలో ఉండే థెఫ్లావిన్‌లు కరోనా సహా పలు వైరస్‌లు, మధుమేహం, ఏజింగ్‌తో వచ్చే సమస్యల చికిత్సలో ఉపకరిస్తాయని కనుగొన్నారు. రపామైస్లిన్ వంటి యాంటీ ఏజింగ్ మందులు, మధుమేహానికి వాడే మెట్‌ఫార్మిన్ ఔషధాలు కొవిడ్-19 చికిత్సకూ పనికి వస్తాయని గుర్తించారు.
Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!
30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!
ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!