Hair Fall: వీటిని ఎక్కువగా తీసుకుంటే బట్టతలతో బాధపడాల్సిందే.. అందుకే దూరం పెట్టండి..

| Edited By: Ravi Kiran

Aug 29, 2022 | 6:38 AM

Hair Care Tips: జుట్టు నెరిసిపోవడం లేదా రాలిపోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. అయితే జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే.  నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా బట్టతల బారిన పడే అవకాశం ఉంది.

Hair Fall: వీటిని ఎక్కువగా తీసుకుంటే బట్టతలతో బాధపడాల్సిందే.. అందుకే దూరం పెట్టండి..
Hair Care Tips
Follow us on

Hair Care Tips: జుట్టు నెరిసిపోవడం లేదా రాలిపోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. అయితే జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే.  నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా బట్టతల బారిన పడే అవకాశం ఉంది. జట్టు రాలకపోవడానికి చాలా కారణాలున్నాయి. హార్మోన్ల సమస్యలతో పాటు అనారోగ్యకరమైన జీవనశైలి వాయుకాలుష్యం ఇంకా చాలా కారణాలున్నాయి. మరీ ముఖ్యంగా పోషకాల్లేని ఆహారం కూడా జుట్టు రాలిపోవడానికి కారణమవుతోంది. శరీరంలో విటమిన్ సి , డి, ప్రోటీన్లు, కాల్షియం స్థాయులు తగ్గిపోతే జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు పోషణకు ప్రోటీన్ చాలా ముఖ్యం. ఎందుకంటే వెంట్రుకల నిర్మాణంలో ప్రొటీన్లది కీలక పాత్ర. ప్రొటీన్ లేకపోవడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని అన్‌హెల్దీ ఫుడ్స్‌ తరచూ తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

అధిక చక్కెర

తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం మన శరీరానికి హానికరం. నివేదికల ప్రకారం, చక్కెరను అధికంగా తీసుకుంటే, అది బట్టతలకి కారణం కావచ్చు. వాస్తవానికి, చక్కెర తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత సమస్య వస్తుంది . ఇది క్రమంగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. చక్కెర వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మేలు

ఇవి కూడా చదవండి

చేపలు

చేపల నుంచి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ముఖ్యమైన పోషకాలు మనకు లభిస్తాయి. అయితే జుట్టు రాలడం సమస్య ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ప్రస్తుతం దొరికే చేపల్లో పాదరసం ఎక్కువగా ఉంటోంది. ఇది శరీరానికి అనేక విధాలుగా హాని చేస్తుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

జంక్ ఫుడ్స్

ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. అయితే వీటిని తినడం అలవాటు చేసుకుంటే మాత్రం రోగాలను ఆహ్వానించినట్లే. జంక్ ఫుడ్స్ లో అజినోమోటో, సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరం, చర్మం, జుట్టుకు హానికరం. జంక్ ఫుడ్స్‌ వల్ల శరీరంలో బయోటిన్ క్షీణిస్తుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఇవన్నీ జట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)