పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తినేముందు తప్పక తెలుసుకోండి..

Green Chilli vs Red Chilli: కారం లేనిదే మనకు ముద్ద దిగదు.. కానీ అదే కారం మన ఆరోగ్యానికి రక్షగా మారుతుందని మీకు తెలుసా..? వంటగదిలో మనం వాడే పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలు కేవలం రుచిని మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. అయితే వీటిలో బరువు తగ్గడానికి ఏది మేలు చేస్తుంది? రోగనిరోధక శక్తిని పెంచడంలో ఏది మొనగాడు? అనేది తెలుసుకుందాం..

పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తినేముందు తప్పక తెలుసుకోండి..
Green Chilli Vs Red Chilli

Updated on: Jan 10, 2026 | 6:20 PM

మన దేశంలో మిరపకాయ లేకుండా ఏ వంట పూర్తి కాదు. కూరల్లో కారం కావాలన్నా, నోటికి రుచి తగలాలన్నా మిరపకాయ ఉండాల్సిందే. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. పచ్చి మిరపకాయలు మంచివా..? లేక ఎండు మిరపకాయలు మంచివా? అని. ఈ రెండింటిలోనూ ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు ఏది దేనికి మేలు చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చి మిరపకాయలు

పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో కేలరీలు ఉండవు. పైగా ఇవి శరీర మెటబాలిజంను వేగవంతం చేసి, బరువు తగ్గడానికి తోడ్పడతాయి. పచ్చి మిర్చిలో ఉండే ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఎర్ర మిరపకాయలు

ఎర్ర మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇదే మిరపకాయలకు ఘాటును ఇస్తుంది. క్యాప్సైసిన్ శరీరంలోని జీవక్రియను పెంచి, నిల్వ ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వంటకానికి గాఢమైన రంగును, ఘాటైన రుచిని ఇవ్వడంలో ఎర్ర మిర్చి తర్వాతే ఏదైనా.

ఇవి కూడా చదవండి

ఏది ఎప్పుడు వాడాలి..?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏ మిరపకాయనైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునే వారు పచ్చి మిర్చిని, బరువు తగ్గాలనుకునే వారు మితంగా ఎర్ర మిర్చిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా తక్కువ కారం కావాలంటే పచ్చి మిరపకాయలను వాడండి. ఇవి పొట్టకు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. ఎక్కువ స్పైసీగా ఉండాలంటే ఎర్ర మిరపకాయలను ఎంచుకోండి. మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులు కలిపిన కారం పొడి లేదా రసాయనాలు వాడిన పచ్చి మిర్చి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇవి గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీయవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..