Morning Food: ఉదయాన్నే వీటిని తింటే ఎన్నో లాభాలు..! అవేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఉదయాన్నే టీ, కాఫీ బదులుగా బాగా ముగ్గిన అరటిపండును తింటే జీర్ణ క్రియకు చాలా మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. అజీర్తి సమస్యలున్న వారు..అలాగే భోజనం చేశాక తియ్యగా ఏదైనా తినాలనే కోరికలు ఉన్నవారు ఉదయాన్నే లేచిన వెంటనే అరటి పండు తింటే చాలా మేలు జరుగుతుంది.

Morning Food: ఉదయాన్నే వీటిని తింటే ఎన్నో లాభాలు..! అవేంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
శరీరంలో యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరగడం మొదలవుతుంది. అదే సమయంలో, శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు, అది కిడ్నీపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2023 | 7:45 PM

అరటి పండు సాంప్రదాయ భారత ఆహార పదార్థాల్లో ఒకటి. మన దేశంలో ఎక్కువగా అరటి పండ్లను దేవునికి నైవేధ్యంగా పెట్టడానికి ఉపయోగిస్తుంటారు. కానీ రోజూ ఉదయాన్నే అరటి పండు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే టీ, కాఫీ బదులుగా బాగా ముగ్గిన అరటిపండును తింటే జీర్ణ క్రియకు చాలా మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. అజీర్తి సమస్యలున్న వారు..అలాగే భోజనం చేశాక తియ్యగా ఏదైనా తినాలనే కోరికలు ఉన్నవారు ఉదయాన్నే లేచిన వెంటనే అరటి పండు తింటే చాలా మేలు జరుగుతుంది. ఒకవేళ అరటిపండు ఇష్టపడకపోతే సీజనల్ గా దొరికే ఏ పండైనా తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

కిస్మిస్, బాదం

అలాగే అరటి పండుతో పాటు ఉదయాన్నే నానబెట్టిన కిస్మిస్ ను తిన్నా చాలా మంచిదని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. రోజుకు 6 నుంచి 7 నానబెట్టిన కిస్మిస్ లు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా నెలసరి సమస్యలున్న ఆడవాళ్లు నానబెట్టిన కిస్మిస్ ను తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్రౌన్ కిస్మిస్ ల కంటే నలుపు రంగు కిస్మిస్ తినాలని సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ నలుపురంగు కిస్మిస్ లు దొరక్కపోతే బ్రౌన్ కిస్మిస్ లనైనా నానబెట్టుకుని తినాలని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల హిమోగ్లోబిన్, రొమ్ము సున్నితత్వం, గ్యాస్, చిరాకు మానసిక అలజడి సమస్యల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. అలాగే రోజూ 4-5 నానబెట్టిన బాదం పప్పులు తింటే మధుమేహం, నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణునలు సూచన. అలాగే వారు చెబుతున్న మరిన్ని ఆహార చిట్కాలను ఓ సారి చూద్దాం

ఇవి కూడా చదవండి
  • భోజనం లేదా టిఫిన్ చేసిన 10-15 నిమిషాల వ్యవధిలోని టీ/కాఫీ తాగాలి.
  • భోజనం చేసిన తర్వాత ఎక్కువగా నీరు తాగగకూడదు. కాబట్టి కేవలం ఒక్క గ్లాస్ వాటర్ నే తాగాలి.
  • భోజనం చేసిన అరగంట వరకూ ఏం చేయకూడదు. అరగంట వర్క్ అవుట్స్ చేయవచ్చు.
  • ఉదయాన్నే లేచిన గంటలోపే అల్పాహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
  • అలాగే ఎండు ద్రాక్షను నానబెట్టిన నీటిని కూడా తాగవచ్చు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…