AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Lemon Water: తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా..? మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

చాలా మంది బరువు తగ్గాలనే ప్రయత్నంలో భాగంగా తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారు. ఉదయాన్నే టీ, కాఫీల కంటే కూడా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తీసుకోవడం చాలా మంచిదనే ప్రచారం..

Honey Lemon Water: తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా..? మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
Honey Lemon Water
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 10, 2023 | 9:34 AM

Share

ప్రస్తుతం జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అధిక  బరువు, బీపీ, డయాబెటీస్ వంటి వాటితో ఇబ్బంది పడేవారు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉన్నారు. వీరిలోని చాలా మంది బరువు తగ్గాలనే ప్రయత్నంలో భాగంగా తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారు. ఉదయాన్నే టీ, కాఫీల కంటే కూడా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తీసుకోవడం చాలా మంచిదనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ డ్రింక్ నిజంగా అందరికీ మేలే చేస్తుందా  లేదా అన్నది అనుమానమే అని నిపుణులు అంటున్నారు.

అయితే ఉదయాన్నే పరగడుపున తేనె తీసుకుంటే రోజంతా యాక్టీవ్‌‌గా ఉండడంలో ఎంతో సహాయపడుతుంది. నిద్రకు ముందు కూడా ఒక టేబుల్ స్పూన్ తేనే తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మానసిక, శారీరక విశ్రాంతికి దోహదం చేస్తుంది. తేనె ప్రకృతి ప్రసాదించే అమృతం వంటిది. మంచి డీటాక్సిఫికెంట్ కూడా.

తేనె, నిమ్మరసం కలిస్తే ఏం జరుగుతుంది..?

తేనె, నిమ్మకాయ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రీ రాడికల్స్‌తో పోరాటానికి కావల్సిన శక్తిని శరీరానికి ఇస్తాయి. అందుకే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ రకమైన పానీయం శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. నిజానికి ఇది సూపర్ మార్నింగ్ డ్రింక్. దీనిని తాగడం వల్ల జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది. తద్వారా బరువు తగ్గడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలా తీసుకోవాలి?

తేనె, నిమ్మరసం తయారుచేసుకునే నీళ్లు గోరువెచ్చగా ఉండాలి. 200 నుంచి 250 మి.లీ. నీళ్లకు నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి. నెమ్మదిగా రుచి ఎంజాయ్ చేస్తు తాగితే మరీ మంచిది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తాగితే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభం అవుతుంది.

అందరూ తాగొచ్చా?

  • అల్సర్లు, అసిడిటీతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తేనె, నిమ్మరసం తీసుకుంటే కడుపులో మంట రావచ్చు. ఇలా మంటగా అనిపించినా లేక కడుపులో నొప్పి వచ్చినా ఈ పానీయం మీకు సరిపడదని అర్థం.
  •  తేనెలోని ఫ్రక్టోజ్ కారణంగా తేనె నిమ్మకాయ రసం డయాబెటిక్స్‌కి అంత మంచిది కాదనే చెప్పాలి. దీని వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంది.
  • బరువు తగ్గేందుకు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు తెనే లేదా ఫ్రక్టోజ్ ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది డంపింగ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు.
  • ఆరోగ్యకరమైన శరీర బరువు మెయింటెయిన్ చెయ్యడానికి చక్కెర, ఉప్పు కలిగిన పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌