Lakshmi Charu: వేసవి కాలం సూపర్ ఫుడ్.. అమృతం అనిపించే అమ్మమ్మ కాలం నాటి లక్ష్మిచారు రెసిపీ మీకోసం

|

Mar 03, 2024 | 9:20 AM

కాలంలో వచ్చిన మార్పులో భాగంగా ఇంకా చెప్పాలంటే కరోనా సమయంలో మనవ జీవితం ఆరోగ్యం గురించి అనేక పాఠాలు నేర్పింది. దీంతో జంక్ పుడ్ కంటే మన పాత వంటలు, పద్దతులు ఆరోగ్యకరమైనవి అంటూ వాటివైపు దృష్టి సారించడం మొదలు పెట్టారు. అలాంటి పాత తరం వంట లచ్చించారు. వేసవిలో సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల సాంప్రదాయ వంటకం లచ్చించారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పాతకాలపు వంట లక్ష్మీచారు, అదే లచ్చించారు ని కొంతమంది, తరవాణి అని మరికొందరు పిలుస్తారు. ఈ తరానికి పెద్దగా తెలియక పోయినా ఒక 30 ఏళ్ల క్రితం లచ్చించారు.. గురువారం, ఆదివారాల్లో రాజ్యం ఏలింది.

Lakshmi Charu: వేసవి కాలం సూపర్ ఫుడ్.. అమృతం అనిపించే అమ్మమ్మ కాలం నాటి లక్ష్మిచారు రెసిపీ మీకోసం
Lacchincharu
Follow us on

మన ముందు తరం వాళ్లు అంటే ఒక రెండు, మూడు తరాలకు ముందు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే తిండి తినేవారు.. అది కూడా పొట్ట నిండుగా తిని.. అంతకు మించి శారీరక శ్రమ పడేవారు.. సమయానికి నిద్ర, తిండి అనే నియమాలను పాటించి 80 ఏళ్లు వచ్చినా ఎంతో హుషారుగా సంతోషంగా జీవించేవారు.. అయితే మారిన కాలంతో పాటు ఆహార, నిద్ర నియమాలలో కూడా మార్పులు వచ్చాయి. సాంప్రదాయ వంటలకు గుడ్ బై చెప్పేసి.. స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ లను తినడం మొదలు పెట్టారు. అయితే కాలంలో వచ్చిన మార్పులో భాగంగా ఇంకా చెప్పాలంటే కరోనా సమయంలో మనవ జీవితం ఆరోగ్యం గురించి అనేక పాఠాలు నేర్పింది. దీంతో జంక్ పుడ్ కంటే మన పాత వంటలు, పద్దతులు ఆరోగ్యకరమైనవి అంటూ వాటివైపు దృష్టి సారించడం మొదలు పెట్టారు. అలాంటి పాత తరం వంట లచ్చించారు. వేసవిలో సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల సాంప్రదాయ వంటకం లచ్చించారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పాతకాలపు వంట లక్ష్మీచారు, అదే లచ్చించారు ని కొంతమంది, తరవాణి అని మరికొందరు పిలుస్తారు.
ఈ తరానికి పెద్దగా తెలియక పోయినా ఒక 30 ఏళ్ల క్రితం లచ్చించారు.. గురువారం, ఆదివారాల్లో రాజ్యం ఏలింది. వేసవి వస్తే చాలు ప్రతి ఇంట్లోనూ లచ్చించారు నోరు ఊరించేది. పిల్లలు, పెద్దలు లచ్చించారు వేసుకొని గోంగూర పచ్చడి నంజుకుని లొట్టలేసేకొనే వారు. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం లచ్చించారు. సొంతం.

కుండలో తరవాణీని ఎలా రెడీ చేయాలంటే

మట్టి కుండను కొని దానిని నీటితో శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండను వంటింట్లో ఓ చుట్టుకుదురుపై ఉంచుకోవాలి. అనంతరం ఈ కుండలో బియ్యం రెండో సారి కడిగిన నీరు, అన్నం వార్చిన గంజి ని పోసి నిల్వ చేస్తారు. ఇలా బియ్యం కడిగిన నీరు, గంజి రెండూ సమానంగా కుండలో పోస్తారు. ఈ నీరు మూడు రోజుల తర్వాత పులియడం మొదలు అవుతుంది. అప్పుడు నీరు తేరుకుంటుంది. ఈ తేట నీరు పారబోసి తరవాణిని తయారు చేస్తారు. చిక్కటి నీరుని లచ్చించారుగా కాస్తారు. అది కూడా గురువారం లేదా ఆదివారం మాత్రమే లచ్చించారుని ఇంట్లో పెట్టె సంప్రదాయం ఉంది. దానిని నేటికీ కొందరు పెద్దల పాటిస్తున్నారు కూడా..

లక్ష్మిచారుకి కావాల్సిన పదార్ధాలు:

  1. చిక్కటి తరవాణి నీరు –
  2. చిన్న ఉల్లిపాయలు
  3. పచ్చి మిర్చి
  4. పసుపు
  5. ములక్కాడ
  6. ముదిరిన తోటకూర కాడలు
  7. బెండకాయలు
  8. వంకాయలు
  9. ఉల్లి కాడలు
  10. ఆనబకాయ
  11. ఉప్పు
  12. కారం

తాలింపు కి కావాల్సిన వస్తువులు

  1. కరివేపాకు
  2. జీలకర్ర
  3. ఎండు మిర్చి
  4. ఆవాలు
  5. ఇంగువ
  6. నూనే

తయారీ విధానం: కుండలో పులిసిన చిక్కటి నీరుని ఒక దళసరి గిన్నెలో లేదా కుండలోకి తీసుకుని దానిలో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న కూరగాయలు ముక్కలను వేసి తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం , కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెట్టి మరబెట్టాలి. అయితే నాన్ వెజ్ ప్రియులు అయితే ఈ లచ్చించారులో అదనపు రుచి కోసం ఎండు రొయ్యలు జోడిస్తారు. ఇలా బాగా మరిగిన లచ్చించారు.. ముక్కలు కూడా ఉడికిన తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి.. నూనే వేసి వేడి చేసి కరివేపాకు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసి పోపు పెడతారు. దింపే ముందు కొత్తమీర తరుగు వేస్తె.. అప్పుడు వచ్చే గుమగుమలతో ఆహా ఏమి రుచి ఆనరా మై మరచి

ఇవి కూడా చదవండి

అన్నం లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ లచ్చించారు పెట్టె కుండని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దీనికి ఇల్లు ఊడిచే చీపుళ్లు, నెలసరి మహిళలు, మైల వారు దూరంగా ఉంటారు. అంతేకాదు లక్ష్మిస్వరుపం లక్ష్మి చారు అంటూ మంగళవారం, శుక్రవారం ఇతరులకు ఇవ్వరు. పూర్వీకులు బాగా ఇష్టంగా తిన్న ఈ సంప్రదాయం వంట ఇప్పుడు మరుగున పడిపోయింది. ఎన్నో పోషక విలువలు లచ్చించారుని గోదావరి జిల్లాల్లోని కొన్ని పల్లెల్లలో మాత్రం ఇప్పటికీ పెట్టుకుంటారు. ఇప్పటికీ ఉమ్మడి గోదావారి జిల్లోని కొన్ని ఇల్లల్లో తర్వాణి కుండ ఉంటుంది. వీలయితే ఇప్పుడైనా గోదావరి జిల్లాల వైపు వెళ్తే.. ఈ లచ్చించారుని రుచి చూడండి.. అప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ లోని సూప్ కూడా ఎందుకు పని వస్తుంది దీని ముందు అని అంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..