మీరు ఉప్పు ఎక్కువగా తింటారా? సాధారణంగా పండ్లు, విజిటబుల్స్ తినడానికి ఇష్టపడరా? అయితే మీ కడుపు ప్రమాదంలో పడినట్లే! క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతున్నట్టే! నిజమండీ.. ఉప్పు అధికంగా తీసుకుంటూ పండ్లు, కూరగాయలు తక్కువగా తినే వారికి గ్యాస్ట్రిక్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏంటి గ్యాస్ట్రిక్ కేన్సర్, అది మన శరీరంలో ఉన్నట్లు ఎలా గుర్తించాలి? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం!
కడుపు క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ కేన్సర్ మన దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. ఇది సాధారణంగా కడుపులోని కణాల్లోని డీఎన్ఏలో మార్పుల కారణంగా వస్తుంది.
– ఆహారం మింగేటప్పుడు ఇబ్బందులు పడటం
– కొంచెం తినగానే కడుపు నిండిపోయిన అనుభవం కల్గడం
– ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం
– పొత్తి కడుపు నొప్పి
– గుండెల్లో మంట
– అజీర్ణం
– ఆకలి మందగించడం
– బరువు తగ్గడం
– వాంతులయ్యేటప్పుడు రక్తం పడటం లేదా నలుపు రంగు పదార్థం కనిపించడం
– మలం నలుపు రంగులోకి మారడం
– హైపర్ ఎసిడిటీ, గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ అనే వ్యాధి సోకడం
– హెలికోబాక్టర్ పైలోరీ బాక్టీరియాతో ఇన్ఫెక్షన్ రావడం
– అధిక మొత్తంలో పొగబెట్టిన.. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం
– ధూమపానం
– తక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం
– కుటుంబంలో ఎవరికైనా లించ్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చి ఉంటటం.
కొన్ని రకాల ఆహార పదార్థాలు ఈ తరహా క్యాన్సర్ ను అధికం చేస్తాయి.. మరికొన్ని ఆహారం పదార్థాలు దాని ప్రభావాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా విటమిన్ సీ, విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఈ కడుపు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, అమెరికా ఇన్ స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ తెలిపింది. అలాగే అధిక ఉప్పుతో కూడిన ఆహార పదార్థాలు అత్యంత ప్రమాదకరం కాగలవని హెచ్చరించింది.
– అవకాడో, బొప్పాయి, గుమ్మడికాయ, బత్తాయి, మొక్కజొన్న, గుడ్డు, బచ్చలికూర వంటి వాటిల్లో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి.
– నారింజ, మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, బంగాళదుంపలు, బెల్ పెప్పర్స్, టమోటాలు, మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.
– విటమిన్ సీ అనేది సిట్రస్ పండ్లు, బెర్రీలలో సాధారణంగా కనిపించే యాంటీఆక్సిడెంట్స్, కెరోటనాయిడ్స్ క్యాన్సర్ ను నిరోధిస్తాయి.
ఇలాంటి మరిన్ని వార్తల కోసం..