Health Tips: చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని టెన్షన్ పడుతున్నారా.. ఈ పదార్థాలు తింటే.. త్వరగా కరిగిపోద్దంతే..

|

Aug 22, 2022 | 10:43 AM

Cholesterol Diet: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఉపయోగపడే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.

Health Tips: చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని టెన్షన్ పడుతున్నారా.. ఈ పదార్థాలు తింటే.. త్వరగా కరిగిపోద్దంతే..
Cholesterol
Follow us on

Cholesterol Diet: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా, గుండెపోటు వస్తుందనే భయం చాలా రెట్లు పెరుగుతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే, ఇంట్లో ఉండే కొన్ని ఆరోగ్యకరమైన వస్తువులను తినాలి. దీని ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆలివ్ నూనె..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి. ఆలివ్ నూనె ఇతర నూనెలతో పోలిస్తే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 8 శాతం వరకు తగ్గించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఓట్స్ ఆరోగ్యకరం..

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఓట్స్ తినండి. ఓట్స్‌లో ఉండే ఫైబర్, బీటా గ్లూకాన్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ని చేర్చుకోవడం ద్వారా, మీరు మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 6 శాతం తగ్గించవచ్చు.

చేపలు..

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి చేపలను తినండి. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, వారానికి రెండు మూడు సార్లు ఆవిరి లేదా కాల్చిన చేపలను తినండి.

అవిసె గింజలు..

చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి అవిసె గింజలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఇందులోని టిప్స్ పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.