AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడూ పాత పద్దతేనా.. షాహీ చికెన్ కుర్మా ఇలా ట్రై చేయండి.. దెబ్బకు గిన్నె ఊడ్చాల్సిందే

నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ ను ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రై ఇలా పలు వంటకాలను ఆస్వాదిస్తారు. అయితే.. దీనికి భిన్నంగా.. షాహీ చికెన్ కుర్మా రెసిపీతో ఇంట్లోనే రుచికరమైన వంటకాన్ని తయారుచేసుకోవచ్చు. అన్నం, చపాతీ, పూరీ వంటి వాటితో ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.. అయితే.. ముందుగా చికెన్ ను మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది.

ఎప్పుడూ పాత పద్దతేనా.. షాహీ చికెన్ కుర్మా ఇలా ట్రై చేయండి.. దెబ్బకు గిన్నె ఊడ్చాల్సిందే
Chicken
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2026 | 8:58 PM

Share

చికెన్ అనగానే.. నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. చికెన్ ను కర్రీ.. ఫ్రై.. ఇంకా అనేక రకాల పద్దతుల్లో వండుకుని.. ఇష్టంగా తింటారు.. అలాంటి నోరూరించే టేస్టీ సూపర్ రెసిపీల్లో షాహీ చికెన్ కుర్మా ఒకటి.. ఈ ప్రత్యేకమైన చికెన్ కుర్మా అన్నం, చపాతీ, పూరీ వంటి ఏ కాంబినేషన్ తో తిన్నా పర్ఫెక్ట్ టేస్ట్ తో చాలా రుచికరంగా ఉంటుంది. ఇది తింటూనే ఉండాలనిపించేంత అద్భుతమైన వంటకం. మీరు సాధారణ చికెన్ కర్రీలు చాలా తిని ఉంటారు.. కానీ ఒక్కసారి ఈ షాహీ చికెన్ కుర్మాని ట్రై చేయండి. రుచి ఖచ్చితంగా అదిరిపోతుంది. ఎల్లప్పుడూ తయారు చేసుకోవాలనుకున్నంత అద్భుతంగా ఉంటుంది.

షాహీ చికెన్ కుర్మా తయారీ విధానం:

మ్యారినేషన్: ముందుగా, శుభ్రం చేసిన ఒక కేజీ చికెన్ లేకపోతే.. సరిపోయేంతగా తీసుకోవాలి. మేము కేజీ చికెన్ రెసిపీ తయారీ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.. మూడు టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మసాలాలు చికెన్ కు అన్నివైపులా బాగా పట్టేలా చూసుకోవాలి. ఇలా కలిపిన చికెన్ ను కనీసం అరగంట నుండి ఒక గంట వరకు పక్కన పెట్టాలి.

ఉల్లిపాయలు వేయించడం: ఒక గంట తర్వాత, పాన్ లో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు గోధుమ రంగులోకి వచ్చి క్రిస్పీగా మారేవరకు బాగా వేయించి, నూనె నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు పూర్తిగా చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

మసాలాలు – చికెన్ వేయించడం: ఇప్పుడు అదే పాన్ లో ఒక స్పూన్ షాజీరా, మూడు దాల్చిన చెక్కలు, ఐదు యాలకులు, ఐదు ఆరు లవంగాలు, బిర్యానీ ఆకులను వేసి 30 సెకన్ల పాటు వేయించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి రెండు, మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో వేయించాలి. మూడు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ కొబ్బరి పొడిని వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఐదు, ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ను నూనెలో ఉడికించాలి.

గ్రేవీ కోసం కాజు – ఉల్లిపాయల పేస్ట్: ఒక మిక్సీ జార్ లో 10-12 కాజులను వేసి పొడి చేసుకోవాలి. ఈ కాజు పొడి చికెన్ కుర్మా గ్రేవీకి మంచి రుచిని ఇస్తుంది. అదే మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చల్లారిన బ్రౌన్ ఆనియన్ ను కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

పెరుగు, కాజు, ఉల్లిపాయల పేస్ట్ చేర్చడం: చికెన్ కాస్త ఉడికి, నీరు బయటకు వచ్చిన తర్వాత, అర కప్పు పెరుగును తీసుకుని బాగా బీట్ చేసి చికెన్ లో కలపాలి. పెరుగు వేసే ముందు మంటను తగ్గించి లో ఫ్లేమ్ లో ఉంచాలి. ఆపై గ్రైండ్ చేసిన కాజు పొడి, బ్రౌన్ ఆనియన్ మిక్స్ ను కూడా వేసి బాగా కలపాలి.

చివరిగా ఉడికించడం: చికెన్ బాగా ఉడకడానికి ఒక కప్పు వరకు నీరు చేర్చి, బాగా కలిపి మూత పెట్టి 15-20 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత, చివరిగా అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తే రుచికరమైన షాహీ చికెన్ కుర్మా సిద్ధం.

ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, ఆస్వాదిస్తూ తినండి. షాహీ చికెన్ కుర్మా .. పులావ్, అన్నం, చపాతీ, పూరీ అన్నింట్లోనూ బాగానే ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎప్పుడూ పాత పద్దతేనా.. షాహీ చికెన్ కుర్మా ఇలా ట్రై చేయండి..
ఎప్పుడూ పాత పద్దతేనా.. షాహీ చికెన్ కుర్మా ఇలా ట్రై చేయండి..
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
పోస్టాఫీసుల్లో అద్బుత స్కీమ్.. పెట్టుబడి డబుల్ గ్యారంటీ
పోస్టాఫీసుల్లో అద్బుత స్కీమ్.. పెట్టుబడి డబుల్ గ్యారంటీ
షారుక్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష
షారుక్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష
ట్యాన్‌ను దూరం చేసే ఇంట్లో తయారు చేసే ప్యాక్స్
ట్యాన్‌ను దూరం చేసే ఇంట్లో తయారు చేసే ప్యాక్స్
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు