AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma: 9 సిక్స్‌లు, 7 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..

Abhishek Sharma Century: అభిషేక్ శర్మ 15వ ఓవర్‌లో తన సెంచరీని పూర్తి చేశాడు. నితీష్ రాణా వేసిన మొదటి రెండు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి, అతను 47 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది అతనికి రెండవ ఐపీఎల్ సెంచరీ, దీంతో టీ20 క్రికెట్‌లో అతని సెంచరీల సంఖ్య తొమ్మిదికి చేరింది.

Abhishek Sharma: 9 సిక్స్‌లు, 7 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
Srh Vs Dc Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Apr 21, 2026 | 8:57 PM

Share

Abhishek Sharma Century: సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ ఐపీఎల్ 2026లో మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక పోరులో అద్భుత శతకంతో చెలరేగడమే కాకుండా వ్యక్తిగత రికార్డులను తిరగరాశాడు. ప్రపంచ కప్ వైఫల్యాలను మరచి, లీగ్ క్రికెట్‌లో తన సత్తా ఏంటో ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించుకున్నాడు.

ప్రపంచ కప్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ..

ఇటీవల జరిగిన ప్రపంచ కప్ పోటీలలో అభిషేక్ శర్మ తీవ్ర ఒత్తిడికి లోనై వరుసగా మూడు సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ యువ ఆటగాడు, ఐపీఎల్ వేదికగా అద్భుత పునరాగమనం చేశాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా, ఒక్కసారి కుదురుకున్నాక తన అసలు సిసలు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

47 బంతుల్లోనే అజేయ శతకం..

సాధారణంగా మెరుపు వేగంతో ఆడే అభిషేక్, ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడు పెంచి కేవలం 47 బంతుల్లోనే తన కెరీర్‌లో రెండో ఐపీఎల్ శతకాన్ని నమోదు చేశాడు. ఢిల్లీ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పరుగుల వరద పారించాడు. ఈ శతకంతో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

2000 పరుగుల మైలురాయి.. దిగ్గజాల సరసన అభిషేక్..

ఈ మ్యాచ్‌లో 59 పరుగుల వద్దకు చేరుకోగానే అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. గతంలో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ వంటి మేటి ఆటగాళ్లు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు. విశేషమేమిటంటే, శిఖర్ ధావన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ఆటగాడు అభిషేక్ శర్మ కావడం గమనార్హం.

ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ తరఫున అత్యధిక పరుగులు..

  • డేవిడ్ వార్నర్ (4014 పరుగులు)
  • శిఖర్ ధావన్ (2768 పరుగులు)
  • కేన్ విలియమ్సన్ (2101 పరుగులు)
  • అభిషేక్ శర్మ (2000*)

ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ తరపున అత్యధిక 50+ స్కోర్లు

  • 42 – డేవిడ్ వార్నర్
  • 19 – శిఖర్ ధావన్
  • 18 – కేన్ విలియమ్సన్
  • 13* – అభిషేక్ శర్మ*
  • 12 – హెన్రిచ్ క్లాసెన్, మనీష్ పాండే

అలాగే, 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాల్లోనూ అభిషేక్ (13 సార్లు) నాలుగో స్థానానికి చేరుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్, మనీష్ పాండే వంటి అనుభవజ్ఞులను వెనక్కి నెట్టి ఈ యువ కిశోరం దూసుకుపోతోంది. ఈ ఇన్నింగ్స్ సన్‌రైజర్స్ అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us