AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖంపై మెరుపు తగ్గుతోందా? ఈ ఫేస్ ప్యాక్స్‌తో మీరు ఊహించని మెరిసే చర్మం మీ సొంతం!

ఎండాకాలం వచ్చిందంటే చాలు సూర్యుడి ప్రతాపానికి చర్మం తన సహజ సిద్ధమైన కాంతిని కోల్పోతుంది. ఎండ వేడి వల్ల ముఖం డల్‌గా, నీరసంగా మారడం సాధారణం. అయితే ప్రకృతి మనకు అందించిన తియ్యని మామిడి పండు కేవలం రుచిలో మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మామిడి పండులో ఉండే విటమిన్ C, A చర్మ రంధ్రాల్లోకి చొచ్చుకుని పోయి మృతకణాలను తొలగిస్తాయి. రసాయనాలతో కూడిన క్రీముల కంటే ఈ పండు గుజ్జు చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తుంది.

ముఖంపై మెరుపు తగ్గుతోందా? ఈ ఫేస్ ప్యాక్స్‌తో మీరు ఊహించని మెరిసే చర్మం మీ సొంతం!
Mango Face Packs For Glowing Skin.jpg
Nikhil
|

Updated on: Apr 21, 2026 | 8:19 PM

Share

సూర్యరశ్మి ప్రభావంతో నల్లగా మారిన చర్మానికి మామిడి పండు ఒక సంజీవనిలా మారుతుంది. ఇది చర్మంపై ఉండే నల్ల మచ్చలను తొలగించి, పట్టులాంటి మృదుత్వాన్ని అందిస్తుంది. వేసవి తాపాన్ని తీర్చుకుంటూనే ముఖాన్ని మెరిపించే కొన్ని ప్రత్యేకమైన మ్యాంగో ఫేస్ ప్యాక్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చర్మ స్వభావాన్ని బట్టి వీటిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎన్‌ఎల్‌ఎమ్ (NLM) అధ్యయనాల ప్రకారం మామిడిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ముడతలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

తేనె, పెరుగుతో..

చర్మం తేమగా, మృదువుగా ఉండటానికి మామిడి గుజ్జుకు ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత కడిగేస్తే, తేనె మాయిశ్చరైజర్‌లా పనిచేసి ముఖాన్ని తాజాగా మారుస్తుంది. ఒకవేళ ఎండ వల్ల చర్మం నల్లగా మారినట్లయితే, మామిడి గుజ్జుకు ఒక స్పూన్ పెరుగు కలిపి ప్యాక్ వేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరిస్తే, మామిడి గుజ్జు సహజమైన గ్లోను ఇస్తుంది. ఈ ప్యాక్ ముఖంలోని నల్లమచ్చలను తగ్గించడమే కాకుండా చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది.

మొటిమల నివారణ

జిడ్డు చర్మం లేదా మొటిమల సమస్య ఉన్నవారు మామిడి గుజ్జుతో పాటు ముల్తానీ మట్టి, కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరిచి జిడ్డును తొలగిస్తుంది. చర్మంపై మృతకణాలు పేరుకుపోయి ముఖం కాంతిహీనంగా అనిపిస్తే, మామిడి గుజ్జుకు ఓట్స్ పౌడర్, పాలు కలిపి మృదువుగా స్క్రబ్ చేయాలి. దీనివల్ల డెడ్ సెల్స్ తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.

అయితే ఈ ఫేస్ ప్యాక్స్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఎప్పుడూ తాజా మామిడి పండు గుజ్జునే వాడటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఖరీదైన పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. పండ్ల రాజు మామిడిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.

Follow Us