Veg Manchuria: సండే స్పెషల్.. చైనీస్ స్పెషల్.. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా వెజ్ మంచూరియా తయారీ..

|

Jul 17, 2022 | 1:13 PM

మీరు శాకాహారులైతే.. రెస్టారెంట్ స్టైల్ లో రుచికరమైన వెజ్ మంచూరియాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఈవెజ్ వెజ్ మంచూరియాను అలాగే చిరు తిండిగా తినవచ్చు.. లేదా ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో  కలిపి ఆస్వాదింవచ్చు. 

Veg Manchuria: సండే స్పెషల్.. చైనీస్ స్పెషల్.. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా వెజ్ మంచూరియా తయారీ..
Veg Manchuria
Follow us on

భారతదేశంలో చైనీస్ ఆహర ప్రియులు అధికంగా ఉన్నారు. అయితే చైనా వంటకాలకు భారతీయుల రుచులు కలిపి.. ప్రత్యేకమైన ఇండో-చైనీస్ రుచికరమైన వంటకాలను తయారు చేస్తున్నారు. దేశంలో అనేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వెలిశాయి. న్యుడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ వంటి వాటికీ స్పెషల్ టెస్టుని అద్దారు. మీరు శాకాహారులైతే.. రెస్టారెంట్ స్టైల్ లో రుచికరమైన వెజ్ మంచూరియాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఈవెజ్ వెజ్ మంచూరియాను అలాగే చిరు తిండిగా తినవచ్చు.. లేదా ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో  కలిపి ఆస్వాదింవచ్చు.

తయారీకి కావాల్సిన పదార్ధాలు:
క్యాబేజీ-1/2 కప్పు
క్యారెట్-1/2 కప్పు
క్యాప్సికమ్-1/2 కప్పు
ఉల్లిపాయ-1/2 కప్పు
అల్లం-1 స్పూన్
వెల్లుల్లి-1 స్పూన్
మొక్కజొన్న పిండి-3 టేబుల్ స్పూన్లు
మైదా-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు-2 స్పూన్లు
నల్ల మిరియాలు-2 స్పూన్లు
సాస్-1 స్పూన్ సోయా
నీరు-1 టేబుల్ స్పూన్

మంచూరియా సాస్ కోసం:
నూనె
వెల్లుల్లి-2 టేబుల్ స్పూన్ల ముక్కలు
అల్లం-1 టేబుల్ స్పూన్ ముక్కలు
పచ్చిమిర్చి 1 స్పూన్ ముక్కలు
టమోటా కెచప్-2 టేబుల్ స్పూన్లు
చిల్లీ సాస్-2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్-1 స్పూన్
వెనిగర్-1 స్పూన్
స్ప్రింగ్ ఆనియన్
ఉప్పు-1 1/2 టేబుల్ స్పూన్
నల్ల మిరియాలు-1 టేబుల్ స్పూన్
మొక్కజొన్న పిండి-3 టేబుల్ స్పూన్లు
1 కప్పు నీరు

ఇవి కూడా చదవండి

తయారీ విధానం: అల్లం, వెల్లుల్లి, మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, ఎండుమిర్చి, సోయా సాస్‌తో పాటు సన్నగా తరిగిన అన్ని కూరగాయలను ఒక గిన్నెలో తీసుకోండి. వాటికీ అవసరమైన నీటిని జోడించి బాగా కలపండి. ఈ కూరగాయల మిశ్రమాన్ని గుండ్రని బాల్స్ గా చుట్టండి. అనంతరం ఈ బాల్స్ ను బాణలిలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

సాస్ సిద్ధం:
బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించాలి. స్ప్రింగ్ ఆనియన్, టొమాటో కెచప్, చిల్లీ సాస్, సోయా సాస్ , వెనిగర్ తరువాత ఉప్పు, నల్ల మిరియాలు జోడించండి. వీటిని బాగా కలపండి. పాన్‌లో మొక్కజొన్న పిండి , నీరు వేసి బాగా  కలపండి. ఈ మిశ్రమంలో వేయించిన కూరగాయల బాల్స్ ను వేసి.. కొంచెం సేపు కలపండి. సాస్‌తో పాటు బంతులను సరిగ్గా కలపండి. అనంతరం  స్ప్రింగ్ ఆనియన్, సెలెరీతో అలంకరించండి. అంతే వెజ్ మంచూరియా రెడీ.. వీటిని వేడి అన్నంతో పాటు వేడిగా వడ్డించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..