ఎండిన కివి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..? ఇలాంటి వ్యాధులకు కూడా చెక్‌ పెట్టొచ్చు..

|

Nov 12, 2023 | 9:01 AM

కివి పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, వివిధ ఫైటోకెమికల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి, ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ వినియోగం మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

ఎండిన కివి తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..? ఇలాంటి వ్యాధులకు కూడా చెక్‌ పెట్టొచ్చు..
Dried Kiwi
Follow us on

కివీ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కివీలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి..కివీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివీని సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ బి, సి, కాపర్, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ మొదలైనవి ఉంటాయి. ఎండు కివీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఎండిన కివిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇవి పొటాషియంను కలిగి ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, మీరు గుండె ఆరోగ్యానికి ఎండిపోయిన కివీని తినవచ్చు. ఎండిన కివీలో విటమిన్ కె, ఇ, మెగ్నీషియం ఫోలేట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండిన కివి కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

కివీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కివీ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది మధుమేహం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు ఎండిన కివీని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటాయి. ఎండిన కివి ఆకలిని నియంత్రించగలవు. కేలరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా మంచివి.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, కివీ పండ్లను తరచూగా తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యలను సులభంగా నియంత్రించుకోవచ్చు. దీంతో బీపీ అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కివీలో క్యాలరీల పరిమాణాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. కివి తినడం వల్ల శరీర టాక్సిన్స్ కూడా తగ్గుతాయి. చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. చర్మంపై అద్భుతమైన గ్లో వస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..