Lemon Juice Coffee: ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి ప్రయత్నస్తారు కానీ వర్కవుట్స్ చేయరు. సులువుగా బరువు తగ్గే మార్గాల కోసం వెతుకుతుంటారు. ఇంటర్నెట్‌లో ఫ్యాట్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి అనేక రెమిడీస్ ఉన్నాయి. కానీ అందులో కొన్ని నిజమైనవవి మరికొన్ని అసత్యమైనవి. ఇటీవల ధీర్ఘకాలికంగా ఉన్న కొవ్వును కరిగించడానికి నిమ్మకాయ కాఫీ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందాం.
1. నిమ్మరసం కాఫీ
బరువు తగ్గించే విషయంలో కాఫీ, నిమ్మకాయ రెండూ ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాఫీలో కెఫిన్ ఉంటుంది ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది, చురుకుదనం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మరోవైపు నిమ్మకాయలు సంపూర్ణతను ప్రోత్సహిస్తాయి. సంతృప్తిని పెంచుతాయి, రోజువారీ కేలరీలు తీసుకోవడం తగ్గిస్తాయి. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నిరోధిస్తాయి.
2. బరువు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందా..
నిమ్మకాయ, కాఫీ రెండూ ఆరోగ్యకరమైనవి అన్నది నిజం. కానీ వీటిలో ఏదీ కొవ్వును కరిగించదు. కాఫీకి నిమ్మకాయను జోడించడం వల్ల ఆకలి తగ్గుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది కానీ కొవ్వు కరగడం అనేది జరగదు. ఊబకాయాన్ని తగ్గించడం అంత తేలికైన పని కాదు. కానీ కేవలం నిమ్మరసం తాగడం ద్వారా కొవ్వు కరిగించవచ్చు. బరువు తగ్గినప్పుడు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతే వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఫిట్‌గా కనిపిస్తారు.
3. తలనొప్పి తగ్గించడానికి జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుందా?
నిమ్మ కాఫీ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. దీనిపై మరింత పరిశోధన అవసరం. అలాగే ఒక రోజులో ఒక కప్పు కంటే ఎక్కువ నిమ్మ కాఫీ తాగకూడదు.