Weight Gain Foods: ఫిట్‌గా ఉండేందుకు ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తెలుసో తెలియకో కొన్ని ఆహారాలు తీసుకుంటూ చిక్కుల్లో పడుతుంటారు. అనేక సర్వేల ప్రకారం, శరీరంలో కొవ్వు ఉండటం వల్ల అనేక వ్యాధులకు గురవుతారని వెల్లడైన విషయం తెలిసిందే. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంతో ఫిట్‌గా తయారవుతారు. అయితే మరి ఫిట్‌గా ఉండాలంటే మాత్రం ప్రతి రోజు ఉదయం మనం తీసుకునే అల్పాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కొన్ని అల్పాహారాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు. లేదని తిన్నారో కచ్చితంగా ఊబకాయాన్ని కోరి తెచ్చుకున్నట్లే. బరువు పెరగకుండా ఉండాలంటే ఈ 6 టిఫిన్స్‌ను అస్సలు తినకూడదు. అవేంటో చూద్దాం.
వైట్ బ్రెడ్: చాలామంది ఉదయాన్ని వైట్ బ్రెడ్‌ను తీసుకోవడం ఓ అలవాటుగా చేసుకుంటారు. కానీ, బ్రెడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరగడమే కాకుండా, బరువు కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి వైట్ బ్రెడ్‌కు బదులు బ్రౌన్ బ్రెడ్ తినడానికి ప్రయత్నిస్తే ఫలితం బాగుంటుంది. కడుపులో మంటలకు కూడా ఇవి కారణం అవుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారం: ప్రాసెస్ చేసిన వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నూనె, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి ఎక్కువంగా ఉన్నవాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు చిప్స్, పాప్‌కార్న్, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
కేకులు, కుకీలు: మైదాతో పాటు నెయ్యిని క్రీమ్‌లు, కేకులతోపాటు కుకీలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని ఉదయాన్నే తీసుకోవడం వలన శరీరవంలో అధిక కొవ్వును పెంచేందుకు తోడ్పడుతాయి. కాబట్టి వీటిని అల్పాహారంలో అస్సలు చేర్చకూడదు.
నూడుల్స్: నూడుల్స్ తినడం మంచిదే. కానీ, వీటిని ఉదయం టిఫిన్‌గా మాత్రం తీసుకోకూడదు. నూనెలతో అధిక ఉష్ణోగ్రతల వద్ద తయారుచేయడం వల్ల త్వరగా జీర్ణం కాకుండా కొవ్వులను అధిక మొత్తంలో తయారుచేసేందుకు తోడ్పడతాయి.
పండ్ల రసాలు: మార్కెట్లో లభించే పండ్ల రసాలను అస్సలు తాగకూడదు. ఇంట్లోనే పండ్ల రసాలను తయారుచేసుకుని తాగితే చాలా మంచింది. జ్యూస్‌కు బదులుగా పండ్లు తినడం అలవాటుచేసుకుంటే మంచింది. అల్పాహారానికి పండ్లు కూడా ఉత్తమమైనవి.
పకోడా, కచోరి: ఉదయం వేయించిన వాటిని తినకపోవడం చాలా మంచిది. పకోడీలు, కచోరిస్ లాంటివి ఉదయం అస్సలు తినకూడదు. ఇవి నూనెలో బాగా వేయించడం వల్ల మన శరీరానికి హాని కలిగిస్తాయి.
Also Read: Beauty Tips: మెరిసే ముఖారవిందం కావాలా? అయితే, ఈ పండ్లను తినండి..
Vegetarian Foods: మీరు శాఖాహారులా..! అయితే కచ్చితంగా ఈ 5 ఆహారాలు తినాలి..
Health News: మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం భోజనంలో ఈ 5 మార్పులు..! ఏంటో తప్పకుండా తెలుసుకోండి..