Health Tips : ఈ 7 ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు..! ఎందుకో తెలుసుకోండి..

|

Jul 30, 2021 | 2:52 PM

Health Tips : నీరు మన శరీరానికి చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించగలడు కానీ నీరు లేకుండా అస్సలు జీవించలేడు. నీరు మన శరీరాన్ని

Health Tips : ఈ 7 ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు..! ఎందుకో తెలుసుకోండి..
Health Tips
Follow us on

Health Tips : నీరు మన శరీరానికి చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించగలడు కానీ నీరు లేకుండా అస్సలు జీవించలేడు. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది అంతేకాకుండా శరీరం నుంచి విషపదార్థాలను బయటికి పంపుతుంది. కానీ ఆయుర్వేదంలో నీరు తాగడానికి కొన్ని నియమాలు చెప్పారు. కొన్ని సమయాలలో నీరు తాగడం మంచిది కాదు. అయితే ఏ సమయంలో నీరు తాగకూడదో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పండ్లు తిన్న తర్వాత నీరు తాగకూడదు. పండ్లలో 80 నుంచి 90 శాతం నీరు ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. ఇది కాకుండా పండ్లలో షుగర్ కంటెంట్ లేదా సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. అందుకే పండ్లు తిన్న తరువాత 45 నిమిషాల వరకు నీరు తాగకూడదు.

2. ఐస్ క్రీం తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఇలా చేస్తే దంత సమస్యలు వస్తాయి. చిగుళ్లు బలహీనంగా మారతాయి. గొంతు నొప్పి సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. ఐస్ క్రీం తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత నీరు తాగవచ్చు.

3. టీ, కాఫీ ఏదైనా వేడి పానీయం తాగిన తర్వాత నీరు తాగవద్దు. కూల్ లేదా వేడి కలిపి ఎప్పుడు తీసుకోకూడదు. జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. కడుపులో బరువు, వాయువు, ఆమ్లత్వం సమస్యలు వస్తాయి.

4. వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగాలనే కోరిక ఉంటుంది. కానీ తాగకూడదు. వేరుశనగ, నీరు రెండూ ఒకదానికొకటి విరుద్దమైనవి. అందువల్ల తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు, గొంతు నొప్పి సమస్యలు వస్తాయి.

5. చాలా చోట్ల స్వీట్లు తిన్న తర్వాత నీరు ఇవ్వడం ఆచారం. కానీ అలా చేయకూడదు. స్వీట్స్‌తో నీరు తాగడం మంచిది కాదు. దీనివల్ల శరీరంలో చక్కెర పరిమాణం వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో టైప్ -2 డయాబెటిస్ ప్రమాదం ఉంటుంది.

6. భోజనానికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల తర్వాత నీరు తాగకూడదు. అన్నం తినేటపుడు తరచూ నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఊబకాయం వచ్చే సమస్యలు ఉంటాయి.

7. చాలా వేగంగా పరుగెత్తాక ఒక్కసారిగా నీరు తాగకూడదు. దీని వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాక నీరు తాగాలి.

PNB Pratibha Loan : పిఎన్‌బి ఎడ్యుకేషన్ లోన్‌కి ఎవరు అర్హులు..! ఎంత మొత్తం చెల్లిస్తారు.. పూర్తి వివరాలు

6 ఓవర్ల మ్యాచులో బౌలర్ల వెన్ను విరిచిన టీమిండియా ప్లేయర్.. 9 బంతుల్లో పెను విధ్వంసం..!

PV Sindhu: ‘సైయ్యా.. సై..సై’.. యమగుచితో పీవీ సింధు హైవోల్టేజ్‌ ఫైట్‌.. ఇద్దరి ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది