Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు అలెర్ట్.. ఈ ఆహారాలను అస్సలు తినకండి.. ఎందుకంటే!
మధుమేహ వ్యాధిగ్రస్తులు పండుగల సమయంలో తమను తాము చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య నిపుణుల సూచన.
పండుగ వచ్చిందంటే చాలు.. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడం.. ఎన్నో రకాల పిండి వంటలు వండుకోవడం.. లాంటివి జరుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పండుగల సమయంలో తమను తాము చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య నిపుణుల సూచన. మరి షుగర్ పేషెంట్స్ పొరపాటున కూడా తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
-
పిండి వంటకాలు:
ఏ పిండితో చేసినప్పటికీ.. పిండి వంటకాలు అన్నింటిలోనూ చక్కెర ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత హానికరం. అందుకే షుగర్ పేషెంట్స్ పిండితో చేసిన వాటిని అస్సలు తినకూడదు.
-
చక్కెర పానీయాలు:
షుగర్‌కు అధిక దాహం ప్రధాన లక్షణం. పండుగ వేళ ఆరోగ్యంపై శ్రద్ధ వహించకుండా.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది చక్కెర పానీయాలు తాగుతుంటారు. అలాంటి పానీయాల్లో కృత్రిమ చక్కెరను కలుపుతారు. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిని దెబ్బతీస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా పెంచుతాయి. షుగర్ పేషెంట్లే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఇలాంటి డ్రింక్స్ ఎక్కువగా తాగకూడదు.
-
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:
ఎక్కువగా నూనెలో వేయించిన ఆహారాల్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు పండగుల సమయంలో వేయించిన ఆహారాన్ని తిన్నట్లయితే, అది చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా, బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది.
-
కాల్చిన డ్రై ఫ్రూట్స్:
కాల్చిన డ్రై ఫ్రూట్స్ రుచి తినడానికి గొప్పగా ఉన్నప్పటికీ.. అవి చక్కెర స్థాయిని పెంచే అవకాశం లేకపోలేదు. ఇలాంటివి తినకుండా షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. నట్స్ వేయించడం కంటే రాత్రంతా నానబెట్టి తినడం మంచిది.