యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4 ఆకులు తింటే మస్త్ బలం.. జుట్టు అద్భుతంగా పెరుగుతుంది..
కరివేపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి.. ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు వంటి పలు పోషకాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, ఎముకలు, గుండె, జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకు.. భారతీయ వంటకాల్లో ఒక అనివార్యమైన భాగం. ఇది కేవలం రుచిని, సువాసనను అందించడమే కాకుండా, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక అద్భుతమైన ఔషధ మూలిక. ఈ చిన్న ఆకులలో ఆరోగ్య సంరక్షణకు, సౌందర్య పోషణకు అవసరమైన ఎన్నో అద్భుత గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల లేదా పచ్చిగా నాలుగైదు నమలడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
కరివేపాకు ఆకుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. వీటితో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి..
రక్తహీనత నివారణ, ఎముకల బలోపేతం:
కరివేపాకు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఐరన్ లోపాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఔషధం. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం దంతాలు, ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారిలో ఎముకల నొప్పిని తగ్గించి, ఎముకలను మరింత బలంగా మారుస్తుంది.
శరీర శుద్ధి, రోగనిరోధక శక్తి:
కరివేపాకులో ఉండే ఫాస్పరస్ శరీరాన్ని శుభ్రపరిచే డిటాక్స్ఫియర్‌గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కరివేపాకును నమిలితే మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ప్రోటీన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల కరివేపాకు రోగనిరోధక శక్తిని బలంగా పెంచుతుంది.. తద్వారా ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.
గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల:
కరివేపాకు చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్)ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కరివేపాకులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అజీర్ణం వల్ల కలిగే విరేచనాలకు పచ్చి కరివేపాకు మంచి ఔషధం. అయితే, దీనిని అతిగా తీసుకుంటే డయేరియాకు కారణం కావచ్చు. కరివేపాకు జీర్ణశక్తిని పెంపొందించి, అజీర్తిని, అధిక ఆమ్ల ఉత్పత్తిని నివారిస్తుంది. ఇది డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది. ఆయుర్వేదంలో కూడా కరివేపాకును జీర్ణాశయ సమస్యలకు ఉపయోగిస్తారు.
జుట్టు, చర్మ సౌందర్యం:
జుట్టు రాలడానికి ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం ముఖ్య కారణాలు. కరివేపాకును తీసుకోవడం వల్ల ఈ లోపాలు సరిదిద్దబడి, జుట్టు రాలడం తగ్గుతుంది. విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కరివేపాకు చర్మ సంరక్షణకు కూడా సహాయపడుతుంది. దీని ఆకుల రసం లేదా పేస్టు కాలిన గాయాలు, తెగిన గాయాలు, చర్మ దురదలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.
ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు:
కరివేపాకు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఆమ్ల స్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదల వంటి సమస్యలను నియంత్రిస్తుంది. కరివేపాకు వేర్లను శరీర నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు ఒక మంచి ఔషధం అని పరిశోధనలు వెల్లడించాయి. పిల్లలలో ఆకలి మందగిస్తే, అన్నంలో కాస్త కరివేపాకు పొడి, నెయ్యి కలిపి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది.
పోషక విలువలు:
కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, నికోటినిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ప్లాస్టి స్టెరాల్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటి అనేక పోషకాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సమగ్ర పోషక విలువలు కరివేపాకును నిజంగా ఒక సూపర్ ఫుడ్‌గా మారుస్తాయి. అయితే.. ఏమైనా సమస్యలుంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
