AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nana Patekar : ఆయన నటనలో నిజాయితీ కనిపించేది.. నానా పటేకర్ మృతిపై ప్రధానీ మోదీ, రజినీకాంత్ ఆర్జీవి, ఎన్టీఆర్ సంతాపం..

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో భారతీయ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం నానా మరణవార్త పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన నటనలో నిజాయితీ కనిపించేదని గుర్తుచేసుకున్నారు.

Nana Patekar : ఆయన నటనలో నిజాయితీ కనిపించేది.. నానా పటేకర్ మృతిపై ప్రధానీ మోదీ, రజినీకాంత్ ఆర్జీవి, ఎన్టీఆర్ సంతాపం..
Nana Patekar Life
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2026 | 12:10 PM

Share

బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. సినీ రంగంలో ఒక శకం ముగిసిందంటూ అంటున్నారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నానా పటేకర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. “నానా పటేకర్ గారి నటనలోని విశిష్టత, ఆయన తీవ్రత, ప్రభావవంతమైన వ్యక్తిత్వం. ఇవి కొద్దిమంది కళాకారులలో మాత్రమే కనిపించే గుణాలు. నానా పటేకర్ తన పాత్రలలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినట్లుగా అపారమైన ప్రతిభను, సృజనాత్మకతను కలిగి ఉండేవారు. అదే సమయంలో, వెండితెరపై ఆయన ఎంతో సజీవంగా చిత్రీకరించిన పాత్రలు మన జ్ఞాపకాలలో నిలిచిపోయేలా జీవం పోసేవి. సూక్తులు చెప్పే వ్యక్తిగా, సూటిగా ఆలోచించే వ్యక్తిగా ఆయనకు పేరుంది, అదే ఆయన ప్రత్యేకత. తాను చూసిన ప్రతి విషయాన్ని నానా పటేకర్ తన ఆలోచనలను అద్భుతమైన స్పష్టతతో వ్యక్తపరిచేవారు. హిందీ , మరాఠీ సినిమాకు నానా పటేకర్ చేసిన సేవ నిజంగా అమూల్యమైనది. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని ఎవరూ పూరించలేరు.” అంటూ ప్రధాని మోదీ పేర్కోన్నారు.

పవన్ కళ్యాణ్ పోస్ట్..

“ప్రముఖ నటుడు శ్రీ నానా పటేకర్ గారి మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. శ్రీ నానా పటేకర్ గారు ఒక అసాధారణ నటుడు. ఆయన పోషించిన ప్రతి పాత్రకు అద్భుతమైన లోతును, సహజత్వాన్ని తీసుకువచ్చారు. ‘క్రాంతివీర్’ చిత్రంలో ఆయన మరపురాని నటన సినీ ప్రేమికుల జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసింది. ‘పరిందా’, ‘ఖమోషీ’, ‘తిరంగా’, ‘అగ్ని సాక్షి’, ‘నటసమ్రాట్’, ‘అబ్ తక్ చప్పన్’ , ‘అపహరణ్’ వంటివి ఆయన విశిష్టమైన కెరీర్‌లోని ఎన్నో చిరస్మరణీయ చిత్రాలలో కొన్ని. భారత సైన్యంతో ఆయనకున్న అనుబంధం , దేశానికి ఆయన చేసిన సేవ, ఆయనలోని ప్రగాఢ దేశభక్తిని, నిబద్ధతను మరింతగా ప్రతిబింబించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు లెక్కలేనంత మంది ఆత్మీయులకు నా హృదయపూర్వక సంతాపం.” అని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు.

రజినీకాంత్ ట్వీట్..

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

ప్రకాష్ రాజ్ ట్వీట్..

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

Follow Us