AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Rajamouli: రాజమౌళి, రమల లవ్ స్టోరీ.. ఆ ఒక్క సినిమా సెట్స్‌లోనే మొదలైంది తెలుసా?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామా రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి సినిమా అనుభవాలు, పాత్రల రూపకల్పన వివరాలను పంచుకున్నారు. శివగామి పాత్ర ఎంపిక, తన భర్త ఎస్.ఎస్. రాజమౌళితో ప్రేమకథ, వారి వివాహ బంధం గురించి మాట్లాడారు. తమ అన్యోన్య దాంపత్యం, సినిమాలే కాకుండా ప్రయాణాలపై తమకున్న అభిరుచిని వెల్లడించారు.

Rama Rajamouli: రాజమౌళి, రమల లవ్ స్టోరీ.. ఆ ఒక్క సినిమా సెట్స్‌లోనే మొదలైంది తెలుసా?
Rama Rajamouli
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2026 | 11:41 AM

Share

డైరెక్టర్ రాజమౌళీ సతీమణి రామా రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జక్కన్న సినీ ప్రయాణంలో అనుక్షణం వెన్నంటే ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితం, రాజమౌళితో తన బంధంపై పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. బాహుబలి పాత్రల రూపకల్పనలో భాగంగా బొట్టు డిజైన్ల గురించి మాట్లాడుతూ, ప్రతి పాత్రకు ప్రత్యేకమైన డిజైన్ ఉండాలని తాము అనుకున్నామని రామా రాజమౌళి తెలిపారు. అనుష్క, ప్రభాస్, రానా వంటి నటీనటులకు వివిధ రకాల బొట్టు డిజైన్లను రూపొందించామని చెప్పారు. ప్రభాస్‌కు అర్థచంద్రాకారం బొట్టు, రానాకు భిన్నమైన బొట్టు వంటివి తన ఊహ నుంచి వచ్చినవేనని, అయితే తనకు బొమ్మలు గీయడం రాదని తెలిపారు. ప్రశాంతి అనే వ్యక్తి ఈ బొట్టు డిజైన్లను అద్భుతంగా గీసిందని, దేవసేన పాత్రకు సంబంధించిన బొట్టు డిజైన్ అయితే పూర్తిగా ప్రశాంతి ఆలోచన అని ఆమె వెల్లడించారు. పలువురు నటీనటుల ముఖాలకు ఏ డిజైన్ సరిపోతుందో తెలుసుకోవడానికి పది రకాల డిజైన్లను ప్రయత్నించి, చివరికి రెండు మూడు ట్రయల్స్ తర్వాత ఖరారు చేశామని వివరించారు.

ఎస్.ఎస్.రాజమౌళితో తన ప్రేమకథ గురించి మాట్లాడుతూ, ఇది ఒక సాధారణ కుటుంబ పరిచయం నుంచి మొదలైందని రామా రాజమౌళి వివరించారు. రాజమౌళి కీరవాణికి బంధువని, వల్లి కీరవాణిని వివాహం చేసుకున్నారని, ఆ విధంగా ముందుగా తమకు రాజమౌళి పరిచయం అయ్యారని తెలిపారు. చాలా సంవత్సరాలు వారు కుటుంబ స్నేహితులుగా ఉన్నారని, అప్పట్లో వారికేమీ ప్రత్యేక అభిప్రాయాలు లేవని చెప్పారు. అయితే కాలక్రమేణా, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత, తామిద్దరం జీవితాంతం కలిసి ఉండగలమని భావించామని పేర్కొన్నారు. ఇది పెద్ద ప్రేమకథ కాదని, కానీ ఒకరికొకరు బాగా అర్థమైన తర్వాతే ఈ బంధం బలపడిందని అన్నారు. శాంతినివాసం రోజుల సమయంలో ఈ పరిచయం గాఢంగా మారిందని, స్టూడెంట్ నెంబర్ వన్ ఆఫర్ వచ్చిన తర్వాత ఈ బంధం మరింత స్పష్టమైందని గుర్తుచేసుకున్నారు. రాజమౌళి సిగ్గు పడే స్వభావం కలవారని, తన పనిపైనే పూర్తి దృష్టి సారించే వ్యక్తి అని, సినిమాలే తన ప్రపంచమని, అయితే కుటుంబం అంటే కూడా ఆయనకు అంతే ఇష్టమని రామా రాజమౌళి వివరించారు.

వారి వైవాహిక బంధం గురించి అడగ్గా, రాజమౌళితో తనకి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా ఉండవని రామా రాజమౌళి చెప్పారు. 99 శాతం తమ అభిప్రాయాలు కలుస్తాయని, అప్పుడప్పుడు పనికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న భేదాలు వస్తాయని తప్ప, వ్యక్తిగత జీవితంలో తమకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని అన్నారు. తామిద్దరం ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. సినిమాలే కాకుండా తమకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టమని, సెలవుల్లో వివిధ దేశాలు తిరగడం అంటే చాలా ఆసక్తి అని తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత ఏయే ఊర్లు, దేశాలు తిరగాలనే దానిపై తరచుగా మాట్లాడుకుంటామని, సందర్శించిన దేశాల కాయిన్స్ సేకరించి ఫ్రేమ్ చేయించుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నామని రామా రాజమౌళి వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

Follow Us