AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్.. పోస్ట్ వైరల్

బెంగళూరులో వంటమనిషిని పెట్టుకోవడం వెనుకున్న కారణం పై ఓ మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. ఇంట్లో వంట చేయడానికి సమయం లేకపోవడంతో కుక్‌కు డబ్బులు చెల్లిస్తున్నా.. రుచికరమైన భోజనం కోసం కాదని, ప్రతిరోజూ ఏం వండాలి అనే ఆలోచన నుంచి తప్పించుకోవడానికేనని ఆమె చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది.

కుక్ ను ఇందుకోసమే పెట్టుకున్నా.. బెంగళూరు మహిళ షాకింగ్ రీజన్.. పోస్ట్ వైరల్
Viral Woman On Bengaluru Cooks Internet Reacts
Sharada V
|

Updated on: Oct 08, 2026 | 11:24 AM

Share

బెంగళూరుకు చెందిన మేఘా ఎక్స్‌లో తను కుక్ ను ఎందుకు పెట్టుకున్నానో వివరిస్తూ విషయాలను పంచుకున్నారు. బెంగళూరులో ఇద్దరు సభ్యులున్న కుటుంబానికి సాధారణంగా వంటవాళ్లు నెలకు రూ 7 వేల నుంచి రూ 8 వేల వరకు తీసుకుంటారనీ, రోజుకు రెండుసార్లు వస్తే ఆదివారం సెలవు తీసుకుంటారనీ తెలిపారు.  కూరగాయలు కోసి, రెండు వంటకాలు త్వరగా తయారు చేసి.. వెంటనే మరో ఇంటికి వెళ్లిపోతారు. ఇలా ఒకే రోజు చాలా ఇళ్లలో వంట చేయాల్సి ఉండటంతో వేగంగా పని చేయడం వారికి తప్పనిసరి అవుతుందని ఆమె వివరించారు.

కుక్కర్‌ వారి ‘ఆయుధం’

వంట త్వరగా పూర్తిచేయడానికి ప్రెషర్ కుక్కర్‌ను కుక్‌లు ఎక్కువగా ఉపయోగిస్తారని మేఘా అన్నారు. పప్పు, ఆలుగడ్డ, సోయా, చికెన్.. ఇలా ఏ వంటకమైనా చివరికి ప్రెషర్ కుక్కర్‌లోనే పండుతారని వ్యాఖ్యానించారు. వంట రుచి విషయానికి వస్తే మాత్రం  రుచికరంగా ఏమీ ఉండదని చెప్పారు. మనకు ఎలా కావాలో పదే పదే చెబితే తప్ప రుచి మనకు నచ్చినట్లు ఉండదనీ, రుచిని పెంచేందుకు ఎక్కువ నూనె, ఎక్కువ మసాలాలు వాడతారనీ పోస్టులో తెలిపారు.

రుచి కోసం కాదు.. వంట పని తప్పించుకోవడానికే!

మేఘా చేసిన అసలు వ్యాఖ్యే నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంది. తాము నెలకు రూ. 8 వేలు రుచికరమైన భోజనం కోసం చెల్లించడం లేదని అన్నారు. రోజుకు రెండుసార్లు ఏం వండాలి? ఎలా వండాలి? అనే ఆలోచన, వంట పని నుంచి తప్పించుకోవడానికే డబ్బు చెల్లిస్తున్నామని వివరించారు. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు.

‘ఫుడ్ డెలివరీ కంటే ఆరోగ్యమే..’

కొందరు నెటిజన్లు మేఘా అభిప్రాయంతో ఏకీభవించారు. కుక్ చేసే భోజనం అంత రుచిగా లేకపోయినా.. ప్రతి రోజూ స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా రెస్టారెంట్ ఫుడ్ తెప్పించుకోవడంతో పోలిస్తే అది చౌక అనీ, ఆరోగ్యకరమని అన్నారు. మరో నెటిజన్‌ బెంగళూరులో రూ.8 వేలు కుక్‌కు చెల్లించడం  తక్కువేననీ చెన్నైలో రోజుకు ఒక్క సారి వచ్చి వంట చేయడానికే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకుంటారని, ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి ఉన్న కుటుంబానికి ఇంకా ఎక్కువ అడుగుతారనీ అన్నారు.  కుక్‌లు కొన్నిసార్లు కేవలం 20 నిమిషాల్లోనే వంట పూర్తి చేసి వెళ్లిపోతారని మరికొందరు కామెంట్ చేశారు. మొత్తానికి, ‘కుక్‌కు మనం డబ్బులు రుచికరమైన భోజనం కోసం చెల్లిస్తున్నామా? లేక వంట చేయాలనే రోజువారీ బాధ్యత నుంచి బయటపడటానికా?’ అనే మేఘా వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Follow Us