Nana Patekar : కోట్ల ఆస్తిని కాదని పల్లెటూరిలో నానా పటేకర్ జీవితం.. 25 ఎకరాల్లో విలాసవంతమైన ఇళ్లు.. వ్యవసాయం..
ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు తెలిపారు. ఆయనను కాపాడేందుకు దాదాపు 45 నిమిషాలపాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతితో సినీరంగంలో విషాదచాయలు అలుముకున్నాయి. దశాబ్దాలుగా సినీరంగంలో వైవిధ్యమైన పాత్రలతో తనదైన ముద్రవేసిన ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. 75 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నానా పటేకర్ గుండె పోటుతో కన్నుమూశారు. అయితే ఆయన మరణంపై పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలియనున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే నానా పటేకర్ జీవితం, ఆయన లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు సోషళ్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కోట్ల ఆస్తులు, పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ నానా పటేకర్ ఒక చిన్న పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడిపుతున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో అలరించిన ఆయన ఆస్తులు దాదాపు 75 కోట్లకు పైగానే ఉందని సమాచారం. అయినప్పటికీ, నానా సాధారణ జీవితాన్నే గడపడానికి ఇష్టపడతారు.
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..
పూణే సమీపంలోని ఖడక్‌వాస్లాలో 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక అద్భుతమైన ఫామ్‌హౌస్ నానా పటేకర్‌కు ఉంది. నగర కోలాహలం నుండి దూరంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు, నానా అక్కడికి వెళ్తారు. దర్శకుడు సంగీత్ శివన్ 2008 చిత్రం ‘ఏక్: ది పవర్ ఆఫ్ వన్’ కూడా నానా యొక్క ఈ ఫామ్‌హౌస్‌లోనే చిత్రీకరించబడింది. తన ఫామ్‌హౌస్ సమీపంలో ధాన్యాలు, గోధుమలు, ఆకుకూరలను పండిస్తూ రైతుగా తనకు నచ్చిన లైఫ్ గడిపారు. నానా పటేకర్ ఫామ్‌హౌస్‌లో 7 గదులు, ఒక పెద్ద హాల్ ఉన్నాయి. టెర్రకోట ఫ్లోర్లు ఉన్నాయి. తన ఇష్టానికి అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నారు నానాపటేకర్. ఆ ఇంటి ద్వారాన్ని బలమైన రాతితో చెయించారు. అలాగే మట్టి పెరడు, చెక్క దూలాలు, సాంప్రదాయ టెర్రకోట ఫ్లోరింగ్‌తో ఈ వాడాను నిర్మించారు. ఇంట్లో విలాసవంతమైన సోఫాలకు బదులుగా విశాలమైన వసారా (ఒంటి), మామిడి చెట్టుకి కట్టిన పెద్ద ఊయల (జూలా) కనిపిస్తాయి.
ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..
అలాగే సినిమా తారల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఎంతో మంది ఈ ఫామ్‌హౌస్‌ను సందర్శిస్తుంటారు. ఇంటికి వచ్చిన ఏ ఒక్కరినీ కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపడం నానా పటేకర్ అలవాటు కాదు. తన సంపాదనలో సింహభాగాన్ని ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా కరువు బారిన పడిన రైతు కుటుంబాలకు దానం చేస్తుంటారు. నివేదికల ప్రకారం రూ. 81 లక్షల విలువైన ఆడి క్యూ7 కారును కలిగి ఉన్నారు. దీనితో పాటు, ఆయన రూ. 10 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో ,రూ. 1.5 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌లను కూడా కలిగి ఉన్నారు.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..
ఎక్కువమంది చదివినవి : మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..
