AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : తగ్గేదే లే.. ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..

బిగ్ బాస్ 10 తెలుగు ఐదో వారం ఓటింగ్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ టాప్ స్థానాల్లో ఉన్నారు. టాప్ 3 కంటెస్టెంట్లే 70% ఓటింగ్ సాధించారు. అత్యంత తక్కువ ఓట్లతో (3%) మరో ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ప్రస్తుత అన్-అఫీషియల్ ట్రెండ్స్ ప్రకారం ఈ వారం ఆ ఒక్కరు మాత్రమే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నాగార్జున తిట్టినా జనాలు మాత్రం ఓట్లు గుద్దిపడేశారు.

Bigg Boss 10 Telugu : తగ్గేదే లే.. ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు.. డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్..
Bigg Boss 10 Telugu Voting Result
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2026 | 6:39 AM

Share

బిగ్ బాస్ సీజన్ 10 రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌ను ఎంతగా వేడెక్కిస్తుందో, బయట ఓటింగ్ ట్రెండ్స్ కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఐదో వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాగా, మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ రేసులో నిలిచారు. సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ కాన్సెప్ట్‌తో సాగుతున్న ఈ ఆటలో ఈ వారం రాం ప్రసాద్, ఝాన్సీ, అమన్, అపూర్వ, ముఖేష్ గౌడ, షాలిని, రోహిత్, త్రిగుణ్, నరేష్, చరణ్ నామినేట్ అయ్యారు. హౌస్‌లోకి కామినర్‌గా అడుగుపెట్టిన రోహిత్‌కు గత వారం హోస్ట్ నాగార్జున తీవ్రంగా క్లాస్ పీకినప్పటికీ, ఆ ప్రభావం అతని ఓటింగ్‌పై పడలేదు. అన్-అఫీషియల్ పోల్స్ ప్రకారం రోహిత్ దాదాపు 26 శాతం ఓటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని బయట ఉన్న పీఆర్ టీమ్ అత్యంత బలంగా పనిచేస్తూ ఓటింగ్ గ్రాఫ్‌ను పెంచుతోందని, ఇతర కంటెస్టెంట్స్ మీద ట్రోలింగ్ సరిహద్దులు దాటుతోందని ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఐదో వారం అన్-అఫీషియల్ ఓటింగ్ లెక్కలను పరిశీలిస్తే.. రోహిత్ – 26%, ముకేష్ గౌడ – 20%, త్రిగుణ్ – 16%, నరేష్ – 9%, రాం ప్రసాద్ – 8%, షాలిని – 6%, అమన్ – 5%, అపూర్వ – 4%, చరణ్ – 3%, ఝాన్సీ – 3%..రోహిత్, ముకేష్ గౌడ, త్రిగుణ్ కలసి మొత్తం ఓటింగ్‌లో దాదాపు 70 శాతం భాగాన్ని దక్కించుకుని సేఫ్ జోన్‌లో నిలిచారు.

డేంజర్ జోన్‌లో ఎవరంటే?

సింగిల్ డిజిట్ ఓటింగ్‌కే పరిమితమైన చరణ్ , ఝాన్సీ అత్యంత తక్కువ (3%) ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. చరణ్ ఇప్పటికే ఎలిమినేట్ అయి వైల్డ్ కార్డ్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చినా, అతని గ్రాఫ్ పెద్దగా మెరుగుపడలేదు. మరోవైపు, టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ, రైతు సింపతీ ఉన్న ఝాన్సీ అనూహ్యంగా లీస్ట్ ఓటింగ్‌లోకి రావడం గమనార్హం. అధికారిక ఓటింగ్ లెక్కలు మారకపోతే ఈ వారం ఎలిమినేషన్ కత్తి ఝాన్సీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షాలిని, అమన్, అపూర్వ కూడా డేంజర్ జోన్ అంచున ఉన్నప్పటికీ, ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఝాన్సీ హౌస్ వీడే ముప్పు ఎక్కువగా ఉంది.

Follow Us
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం
విషాదంగా ముగిసిన ఇరాన్‌ యువకుడి కథ .. ఉరిశిక్షకు ముందు వివాహం