AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం

Rashi Phalalu (October 8, 2026): గురువారం 12 రాశుల వారికి గ్రహాల ప్రభావంతో భిన్నమైన ఫలితాలు కనిపించనున్నాయి. మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉండటంతో ధన యోగం కలిసివచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మిథున రాశి వారికి చాలాకాలంగా ఎదురవుతున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. మిగతా రాశుల వారికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
Horoscope Today 08 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 08, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 8, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ధన యోగం పడుతుంది. వృషభ రాశి వారు ఇతరులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మిథున రాశి వారికి కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గురు, రాహువుల అనుకూలతతో పాటు సప్తమ స్థానంలో శుక్ర, బుధుల యుతి వల్ల ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు, ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో క్రియాశీలంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ధన యోగం పడుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశికి లాభ స్థానంలో శనీశ్వరుడి సంచారం, తృతీయ స్థానంలో గురు, కుజులు ఉండడం వల్ల ఊహించని ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. రోజంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోవడంతో పాటు వృత్తి, ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులు ఎంతో నమ్మకంతో బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇతరులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలో, గురువు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం కలిసి రావడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉండడం, మనసులోని కోరికలు నెరవేరడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు. శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశిలో గురు, కుజులు, చతుర్థ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల సుఖ సంతోషాలకు, మనశ్శాంతికి లోటుండదు. ఆర్థిక సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలన్నీ అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవి ధన స్థానంలో, శుక్ర, బుధులు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. లాభదాయక పరిచయాలు ఏర్ప డతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

లాభ స్థానంలో కుజుడు, ఉచ్ఛ గురువు, ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. ఆలయాలు సందర్శించడం గానీ, విహార యాత్రకు వెళ్లడం గానీ జరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

మూడు శుభ గ్రహాలతో పాటు శని కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

గురు, శని, కుజులు అనుకూల స్థానాలలో ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కెరీర్ కు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలనిస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. సలహాలు, సూచనలకు బాగా విలువ ఉంటుంది. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృథా ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రవి, రాహు, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు, వ్యవ హారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కెరీర్ పరంగా అనేక లాభాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తు లతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది.ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిత్రుల వల్ల కొద్దిగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

శని, గురు, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తి కరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేసి ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర, బుధలు సంచారం వల్ల కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు బాగా ఎక్కువగా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కొద్దిగా పురోగతి సాధిస్తారు. బంధువుల్లో కొందరు అపనిందలు వేసే అవకాశం ఉంది. మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు కుజుడితో కలిసి ఉండడం వల్ల కుటుంబంలో శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆదాయం, రాబడి పెరుగుతాయి. ఏలిన్నాటి శని వల్ల వృథా ఖర్చులు, స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

Follow Us