AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ సినిమా గురించి తెలుసా.. ?

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ ఇద్దరూ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో ఈ ఇద్దరు హీరోలు చక్రం తిప్పుతున్నారు. అయితే రజినీ సినిమాలో చిరు విలన్ గా నటించాడని మీకు తెలుసా..? అవును.. 45 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Tollywood : రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ సినిమా గురించి తెలుసా.. ?
Ranuva Veeran
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2026 | 7:09 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ నటులు. అయితే వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? దాదాపు 45 ఏళ్ళ క్రితమే ఈ అరుదైన కాంబినేషన్ వెండితెరపై మెరిసింది. రజినీకాంత్ హీరోగా నటించగా, చిరంజీవి అందులో శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా విశేషాలు ఇవే! 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి, కెరీర్ ప్రారంభంలో నటుడిగా నిరూపించుకోవడానికి హీరో పాత్రలతో పాటు నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. ఆ క్రమంలోనే 1981లో రజినీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘రణవీరన్’ లో చిరంజీవి ప్రతినాయకుడిగా (విలన్) నటించారు. ఈ చిత్రంలో శ్రీదేవి కథానాయికగా నటించింది.

రజినీకాంత్, చిరంజీవి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 1981 అక్టోబర్ 26న విడుదలైన ఈ సినిమా తమిళంలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్‌గా నటించింది. 1981 అక్టోబర్ 26న తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం 1982లో తెలుగులోకి ‘బందిపోటు సింహం’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దర్శకుడు ఎస్.పి. ముత్తురామన్, రచయిత వీరప్పన్ ఈ కథను తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ (MGR) కోసం సిద్ధం చేశారు. అయితే ఆ సమయంలో ఎమ్జీఆర్ రాజకీయాలో తీవ్ర బిజీగా ఉండడంతో, ఆ అవకాశం రజినీకాంత్‌ను వరించింది. తమిళంలో మాస్ యాక్షన్ హీరోగా రజినీకాంత్‌కు ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం రజినీకాంత్, చిరంజీవిల మధ్య గొప్ప స్నేహబంధానికి పునాది వేసింది. ఆ తర్వాతి కాలంలో చిరంజీవి తెలుగులో ‘మెగాస్టార్’గా ఎదిగారు. 1989లో చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రాన్ని తమిళంలో ‘మా పిళ్ళై’గా రీమేక్ చేసినప్పుడు, రజినీకాంత్ కోరిక మేరకు చిరంజీవి అందులో ప్రత్యేక అతిథి పాత్రలో మెరిసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. చిరు, రజినీ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

Follow Us
రజినీ సినిమాలో చిరు విలన్.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా ఇదే..
రజినీ సినిమాలో చిరు విలన్.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా ఇదే..
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయాణ'లో అరుణ్ గోవిల్
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయాణ'లో అరుణ్ గోవిల్
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు