AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. నేడు ఏపీ, తెలంగాణలోని వాతావరణంలో కీలక మార్పులు ఉండనున్నట్టు తెలిపింది. ఓ వైపు నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రభావంతో వర్షాలు కురిస్తే మరో వైపు భారీ ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణం కూడా ఉంచే ఛాన్స్ ఉందని తెలిపింది. కాబట్టి తెలుగురాష్ట్రాల్లో నేటి వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.

Weather Report: తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Andhra, Telangana Latest Weather Report
Anand T
|

Updated on: Oct 08, 2026 | 7:07 AM

Share

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈ రోజు ఏపీ, తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొనే ఛాన్స్ ఉందని అంచానా వేసింది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రభావంతో బుధవారం కూడా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 30-39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మరి కొన్ని చోట్ల దాదాపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే రాబోయే రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, తెలంగాణలో పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెళ్లిపోతాయని.. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌లో వాతావరణ ఇలా

హైదరాబాద్‌లో గురువారం కలివిడి వాతావరణం ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం సమయంలో చల్లని గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని.. మధ్యాహ్నం సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి.. ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కపోతను ఎదుర్కొనే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింద. ఇక సాయంత్రం సమయంలో కాస్త ఆహ్లాదకరమైన వారణవారణం ఉండొచ్చని.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లులు కూడా కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక బుధవారం తెలంగాణలోని హన్మకొండ, వరంగల్, కాజీపేట జంట నగరాల పరిధిలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని నగరాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత, పొడి వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింద.

ఏపీలో వాతావరణం ఇలా

ఇక ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాలో పొడి వాతావరణం ఉండొచ్చని అంచనా వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయాణ'లో అరుణ్ గోవిల్
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయాణ'లో అరుణ్ గోవిల్
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది