AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nana Patekar : రియల్ హీరో నానా.. కార్గిల్ యుద్ధంలో ఆర్మీతో కలిసి పోరాడిన ఏకైక నటుడు.. ఏకంగా 60 రోజులు సాహసం..

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతి చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 75 ఏళ్ల ఈ నటుడు గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారని, ఆయన కుమారుడు మల్హర్ వెల్లడించారు. మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత అయిన నానా, తన అద్భుతమైన నటనతో పాటు, తన దాతృత్వానికి , భారత సైన్యంతో ఉన్న అనుబంధానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీలో భాగంగా ఉండేవారు. తరచుగా మాజీ సైనికులు, వారి కుటుంబాల కోసం నిధులు సేకరించేవారు.

Nana Patekar : రియల్ హీరో నానా.. కార్గిల్ యుద్ధంలో ఆర్మీతో కలిసి పోరాడిన ఏకైక నటుడు.. ఏకంగా 60 రోజులు సాహసం..
Nana Patekar In Kargil War
Rajitha Chanti
|

Updated on: Oct 08, 2026 | 9:47 AM

Share

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించింది. మూడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత అయిన నానా, తన అద్భుతమైన నటనతో పాటు, తన దాతృత్వానికి, భారత సైన్యంతో ఉన్న అనుబంధానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే నటనకు బ్రేక్ ఇచ్చి ఆర్మీలో చేరారు. అంతేకాదు తరచుగా మాజీ సైనికులు, వారి కుటుంబాల కోసం నిధులు సేకరించేవారు. అలాగే ఆయన దాదాపు 60 రోజులు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కోట్ల రూపాయల పారితోషికం లభించే సినిమాలను, స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి, దేశ సరిహద్దుల్లో సైనికులకు తోడుగా నిలిచిన అరుదైన నటుడు నానా పటేకర్. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన ఇండియన్ ఆర్మీతో కలిసి దాదాపు 60 రోజుల పాటు సేవలు అందించారు.

1991లో నానా పటేకర్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన ‘ప్రహార్’ సినిమా కోసం ఆయన పూణేలోని మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీలో దాదాపు మూడేళ్ల పాటు కఠినమైన మిలిటరీ శిక్షణ తీసుకున్నారు. సాధారణ నటుడిగా కాకుండా, నిజమైన సైనికుడిలానే కమాండో ట్రైనింగ్ పూర్తి చేశారు. 1999లో, కార్గిల్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఆ డివిజన్‌లోని ఉన్నతాధికారులను సంప్రదించారు, కానీ ఆయన అభ్యర్థన తిరస్కరించారు. కేవలం రక్షణ మంత్రి మాత్రమే దీనిని ఆమోదించగలరని ఆయనకు చెప్పారు. దీంతో యుద్ధరంగంలోకి వెళ్ళడానికి రక్షణ మంత్రి నుండి ప్రత్యేక అనుమతి కోరారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ ఆయనలోని క్రమశిక్షణ, నైపుణ్యాలను గుర్తించి గౌరవప్రదమైన ‘కెప్టెన్’ హోదాను కల్పించింది.

1999 ఆగస్టులో నానా నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న యుద్ధరంగంలో పక్షం రోజులకు పైగా గడిపారు. అక్కడ సైనికులకు సహాయం చేయడంతో పాటు, బేస్‌లోని ఆసుపత్రిలో కొన్ని రోజులు పనిచేశారు. కార్గిల్‌లో ఉన్నప్పుడు తాను క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT)లో భాగంగా ఉన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా -10 డిగ్రీల చలిలో సైనికులతో కలిసి ఉంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తన కార్గిల్ యుద్ధం అనుభవం గురించి గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోలో మాట్లాడుతూ.. “నేను శ్రీనగర్ చేరుకున్నప్పుడు 76 కేజీలు ఉన్నాను. తిరిగి వచ్చేసరికి 56 కేజీలకు పడిపోయాను,” అని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

Follow Us
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు